
MOVIE NEWS
దర్శకుడు శ్రీ క్రిష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు
యువ దర్శకుడు శ్రీ క్రిష్ జన్మదినం సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు శుభాకాంక్షలు తెలియచేశారు. మంగళవారం సాయంత్రం ‘వకీల్ సాబ్’ షూటింగ్ జరుగుతున్న అన్నపూర్ణ స్టూడియోస్ లో శ్రీ పవన్ కల్యాణ్ గారు శ్రీ క్రిష్ కు పుష్పగుచ్చం ఇచ్చి విషెస్ తెలిపారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ గారు కథానాయకుడిగా శ్రీ క్రిష్ ఓ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న సంగతి విదితమే. ఈ చిత్రానికి శ్రీ ఎ.ఎం.రత్నం నిర్మాత.
మంగళవారం సాయంత్రం శ్రీ పవన్ కల్యాణ్ గారిని కలిసినవారిలో నిర్మాత శ్రీ ఎ.ఎం.రత్నం, మాటల రచయిత శ్రీ బుర్రా సాయిమాధవ్, రచయితలు శ్రీ భూపతి రాజా, శ్రీ కన్నన్ లు ఉన్నారు.