MOVIE NEWS

విజయదశమి కానుకగా ‘భద్రకాళి’ చిత్ర సప్త గీతాలు ఆవిష్కరణ లెజెండరీ హీరోయిన్ జయప్రద తో 43 సంవత్సరాల క్రితం ‘భద్రకాళి’

విజయదశమి కానుకగా ‘భద్రకాళి’ చిత్ర సప్త గీతాలు ఆవిష్కరణ
లెజెండరీ హీరోయిన్ జయప్రద తో 43 సంవత్సరాల క్రితం ‘భద్రకాళి’ అనే టైటిల్ తో వచ్చిన ఆ చిత్రం అప్పట్లో సెన్సేషన్ క్రియెట్ చేసింది. మళ్ళీ అదే టైటిల్ తో బేబి తనిష్క, బేబి జ్యోషిక సమర్పణలో ఆర్‌. పిక్చర్స్‌ పతాకంపై ఒక భక్తుడి యదార్థ సంఘటన ఆధారంగా వస్తున్న చిత్రం భద్రకాళి. ఈ చిత్రంలో ఏడు సూపర్‌హిట్‌ సాంగ్స్ వీగా మ్యూజిక్ ద్వారా ఆడియో విజయదశమి పండుగ కానుకగా ఈరోజు నటి సీత, కెమెరామెన్ విజయ్‌ టి, దర్శకుడు కె.ఎం.ఆనంద్‌ చేతులమీదుగా విడుదలచేశారు.
ఈ సందర్భంగా నటి సీత మాట్లాడుతూ : “ఈ చిత్రంలో నేను భద్రకాళి గా నటిస్తున్నాను. నా కెరీర్ లో ఇప్పటివరకు దేవత పాత్రలు ఎన్నో వేసాను కానీ రౌద్రం కూడిన భద్రకాళి గా వేయడం ఇదే తొలిసారి, ఈ మధ్య భక్తిరస ప్రధాన చిత్రాలు రావడం లేదు అప్పట్లో ఫిలిం ద్వారా సినిమాలు నిర్మించేవారు గ్రాఫిక్స్ కి అవకాశం ఉండేది కాదు. ఇప్పుడు డిజిటల్ మూవీస్ వచ్చేశాయి అత్యుత్తమ సాంకేతిక విలువలతో కూడిన చిత్రాలను రూపొందించడానికి అవకాశం వుంది. ఈ చిత్రం కూడా ప్రస్తుతం వున్నా టెక్నాలజీ ని ఉపయోగించుకుని నిర్మిచారు. “
దర్శకుడు కె . ఏం . ఆనంద్ మాట్లాడుతూ : “భద్రకాళి అమ్మవారికి ఓ భక్తుడికి మధ్య జరిగిన యదార్థ సంఘటన ఆధారంగా ఈ చిత్ర కథను రెడీ చేసాము. సీత గారు ఆ పాత్రలో అమ్మవారుగా ఒదిగిపోయారు. చిత్రంలోని సహజమైన విజువల్ ఎఫెక్ట్ కోసం గ్రాఫిక్స్ చేయడం జరిగింది. భక్తి రసప్రదాన చిత్రాలు వచ్చి చాలా కాలం అయ్యింది. ఈ గ్యాప్ పూరించడానికి ఈ కథను ఎంపిక చేయడం జరిగింది” అన్నారు
నిర్మాత చిక్కవరపు రాంబాబు మాట్లాడుతూ : “అన్నమయ్య, అమ్మోరు, దేవుళ్ళు చిత్రాల స్థాయిలో ఈ చిత్రం వచ్చింది. ఈ జోనర్ లో వున్నా సినిమాలకు సంగీతం ముఖ్యం అవి ఎవర్ గ్రీన్ గా ఉండాలి అందుకోసం ఇందులో ఏడు పాటలు కూడా అదేస్థాయిలో రికార్డింగ్ చేసాము ఈ రోజు వీగా మ్యూజిక్ ద్వారా విజయదశమి రోజున అమ్మవారు భద్రకాళి అశ్విర్వాదంతో విడుదల కావడం ఆనందంగా వుంది” అన్నారు.
నటీనటులు:- సీనియర్‌ నటి సీత, సంధ్య, మనీష్‌, తాగుబోతు రమేష్‌, ధనరాజ్, చమ్మకుచంద్ర, చిత్రం శ్రీను, జయవాణి, అశోక్ తదితరులు.
సాంకేతిక నిపుణులు :- కెమెరా: విజయ్‌ టి, సంగీతం: ఆదీష్‌ ఉత్రియన్‌, గ్రాఫిక్స్‌: RGB స్టూడియోస్‌, డి.ఐ: ప్రభు, ఎడిటింగ్‌: జెమా, మాటలు: పోలూరుఘటికాచలం, పాటలు: శ్రీగురు,ఆర్ట్: వెంకటేష్, సమర్పణ: బేబి తనిష్క, బేబి జ్యోషిక, నిర్మాత: చిక్కవరపు రాంబాబు, దర్శకత్వం: కె.ఎం. ఆనంద్‌.

Tags

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close