MOVIE NEWS

యంగ్‌ హీరో నాగశౌర్య #NS20లో కీల‌క‌పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు. సెప్టెంబ‌ర్ 18 నుండి షూటింగ్‌

యంగ్‌ హీరో నాగశౌర్య #NS20లో కీల‌క‌పాత్ర‌లో జ‌గ‌ప‌తిబాబు. సెప్టెంబ‌ర్ 18 నుండి షూటింగ్‌

యంగ్‌ హీరో నాగశౌర్య హీరోగా సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో  శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి ప‌తాకాల‌పై #NS20 ను  ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సిక్స్ ప్యాక్ బాడీతో చేతిలో బాణం ప‌ట్టుకుని వారియ‌ర్ పోజ్ లో నాగ‌శౌర్య నిల్చొని ఉన్న స్ట‌న్నింగ్‌ ఫస్ట్‌లుక్ అంద‌రినీ థ్రిల్ చేసింది.  స‌రికొత్త‌గా క‌నిపిస్తోన్న నాగ‌శౌర్య లుక్ సూప‌ర్బ్ అని అంద‌రూ అప్రి‌షియేట్ చేశారు. ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు. 
ప్ర‌భుత్వ నిబంధనల ప్ర‌కారం అన్ని జాగ్ర‌త‌లు తీసుకుంటూ సెప్టెంబ‌ర్ 18 నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై నాన్ స్టాప్ గా జరుగుతుందని నిర్మాత‌లు తెలిపారు.  ప్రాచీన విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా  అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో తెర‌కెక్కుతోన్న ఈ చిత్రంలో నాగ‌శౌర్య విలుకాడుగా క‌నిపించ‌నున్నారు. 

యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌ : రామ్‌రెడ్డి, సంగీతం:  కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌:  జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం : సంతోష్‌ జాగర్లపూడి.


Young Hero Naga Shaurya’s #NS20 To Have Versatile Actor Jagapathi Babu In A Crucial Role. Shoot From September 18th

Young Hero Naga Shaurya’s next #NS20 is Directed by Sathossh Jarlapudi,  Produced by NarayanaDas Narang, Puskur Ram Mohan Rao, Sharrath Marar in Sri Venkateswara Cinemas LLP And Northstar Entertainment Pvt Ltd banners. The First Look of #NS20 featuring Naga Shaurya sporting a Six-pack chiseled boday holding a bow thrills everyone and draws appreciation from all corners. Versatile Actor Jagapathi Babu is playing a crucial role in this film.

The shoot of #NS20 will commence from 18th September. The Production House is taking all care to maintain the required protocol for health and safety during these COVID times. This is a sports based film with Naga Shourya portraying an archer who takes on the challenges that come his way to finally experience triumph and glory.
The film has Naga Shaurya, Ketika Sharma, Jagapathi Babu as the lead cast. The shoot of the film will start from September 18th and progress in a non-stop manner.
Cinematographer: Raam Reddy, Music: Kaalabhairava, Editor: Junaid, 
Producers: Narang Das K Narang, Puskur Ram MohanRao, Sharrath Marar, 
Story, Screenplay, Direction: Santhossh Jagarlapudi.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close