
హరికృష్ణ గారి 2 వ వర్ధంతి సందర్బంగా మాదారపు వెంకటేష్ ఘన నివాళులు
అన్న ఎన్టీఆర్ (NTR) గారిని అతితక్కువ సమయం లో అఖిలాంధ్రులకు దగ్గర చేసిన చైతన్య రధ సారధి దివంగత నందమూరి హరికృష్ణ గారని శ్రీకాకుళం నగర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, జిల్లా నందమూరి బాలయ్య ఫాన్స్ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు, ఈ రోజు హరికృష్ణ గారి 2 వ వర్ధంతి సందర్బంగా వెంకటేష్ తన స్వగృహం లో హరికృష్ణ గారి చిత్ర పటానికి పుష్ప మాలలతో ఘన నివాళులు అర్పించిన అనంతరం మాట్లాడుతూ కోవిడ్ నిభందనలు వలన ఈ కార్యక్రమం బహిరంగంగా జరుపలేక పోతున్నామని, టీడీపీ పార్టీ ను అన్న ఎన్టీఆర్ గారు స్థాపించినపుడు చైతన్య రధ సారధిగా కేవలం 9 నెలల కాలం ఉమ్మడి రాష్ట్ర ప్రజలు కు ఎన్టీఆర్ గారిని చేరువ చేసారని అలాగే హరికృష్ణ గారు నిగర్వి స్నేహశీలి అని, ఆయన ఎంతో మందికి రాజకీయం గా ఉన్నతి స్థితి కలిపించారని ఆయన అన్న గారి వలే ఆత్మ గౌరవం నినాదానికి ప్రాధాన్యత ఇచ్చేవారని, అసలు నందమూరి అంటేనే ఆత్మ గౌరవం అని, ఆ పేరు వింటేనే యావత్తు తెలుగుజాతి గర్వంగా ఉప్పొంగి, ఆత్మ గౌరవం, విశ్వాసం తో అభివృద్ధి బాట పట్టిందని ఆవిధంగా నందమూరి వంశం, అన్న గారు తెలుగువారికీ ప్రేరణ కలిగించారని, చంద్రబాబు గారు ముఖ్య మంత్రి గా వున్నా సమయం లో హరికృష్ణ గారు ఉమ్మడి రాష్ట్ర రవాణా శాఖా మాత్యులుగా ఆర్టీసీ లో ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలతో అభివృద్ధి బాటపట్టించారని, మహిళలుకు ఆర్థిక స్వాలంభన సాధిచాలి వారు కాళ్లపై వారు నిలదొక్కుకోవాలనే మంచి ఉద్దేశంతో ఆర్టీసీ లో మహిళా కండక్టర్ లగా అవకాశం కలిపించిన ఘనత హరికృష్ణ గారిదే అని, అలాగే రాజ్యసభ సభ్యులు గా, పొలిట్ బ్యూరో సభ్యులు గా కూడా టీడీపీ వారిని గౌరవించిందని, తన తండ్రి గారు స్థాపించిన టీడీపీ ఎపుడు ప్రజా సేవలో, తెలుగుజాతి అభివృద్ధి కోసం, రాష్ట్రభివృద్ది కోసం ప్రజా హృదయాలలో ఉండాలన్నదే ఆయన ఆశయమని, ఆయన ఆశయసాధన కోసం ప్రతి టీడీపీ నాయకులు, క్యాడర్, యావత్తు నందమూరి అభిమానులు కృషి చేయాలనీ, ఆయన నటులు గా “సీతయ్య, లాహిరి లాహిరి, సీతా రామరాజు ” లాంటి హిట్ చిత్రాల ద్వారా మంచి, నాయకుడి గా నటుడిగా పేరు తెచ్చుకున్నారని ఆయన లాంటి నిష్కళంక, నిజాయతి, కమిట్మెంట్ గల నేతను కోల్పోపోవడం తెలుగు వారికీ, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కు, నందమూరి వంశానికి తీరని లోటని, ఆయన కు బాధా తప్త హృదయాలతో, కన్నీటి నివాళులు అర్పిస్తున్నామని వెంకటేష్ తెలిపారు