MOVIE NEWS

బతికిఉన్న RGV పై బయో పిక్

A PRESS NOTE

బొమ్మాకు క్రియేషన్స్ సంస్థ

రామ్ గోపాల్ వర్మ నిజ జీవితాన్ని 3 భాగాలు, అనగా 3 చిత్రాలుగా నిర్మించబోతోంది.

దీనికి సంబంధించిన పార్ట్ 1 ఫస్ట్ లుక్ పోస్టర్ రేపు 26 సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేయబోతున్నారు .

3 చిత్రాల్లో ఒక్కొక్క చిత్రం నిడివి సుమారు 2 గంటలుంటుంది అంటే 3 చిత్రాలు కలిపి 6 గంటలు.

బొమ్మాకు మురళి నిర్మాణంలో రామ్ గోపాల్ వర్మ ఆధ్వర్యంలో “దొరసాయి తేజ” ఈ చిత్రానికి దర్శకత్వం చేయబోతున్నాడు .

సెప్టెంబర్ లో ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానున్నది.

పార్ట్ 1 లో 20 ఏళ్ళ ఆర్జీవీ లాగా ఒక కొత్త యువ నటుడు నటించబోతున్నాడు.

పార్ట్ 2 లో వేరే నటుడు నటించబోతున్నాడు.

పార్ట్ 3 లో ఆర్జీవీ యే స్వయంగా ఆర్జీవీగా నటించబోతున్నారు .

3 పార్టుల్లో ,ఒక్కొక్క పార్టు ఆర్జీవీ గారి జీవితం లోని ఆయన వేరు వేరు వయసుల్లో జరిగిన వేరు వేరు అంశాలను చూపెట్టబోతోంది

పార్ట్ 1

“రాము “

రామ్ గోపాల్ వర్మ ఆరంభం.

దీంట్లో ఆయన విజయవాడ కాలేజ్ రోజులు, ఆయన తోలి ప్రేమలు, అప్పట్లో ఆయన పాల్గొన్న గ్యాoగ్ ఫైట్స్ తో మొదలయ్యి ,అయన శివ సినిమా చేయడానికి ఎలాంటి పన్నాగాలు పన్నాడు, రిలేషన్షిప్స్ ను ఎలా మాయ చేసి వాడుకున్నాడు అన్నది ప్రధాన కథాంశం గా చూపెట్టబోతోంది.

పార్ట్ 2

“రామ్ గోపాల్ వర్మ”
—అండర్ వరల్డ్ తో ప్రేమాయణం

ఇది తన ముంబై జీవితంలో అమ్మాయిలు, గ్యాంగ్ స్టర్స్ మరియు అమితాబ్ బచ్చన్ లతో ఆయనకున్న అనుబంధాల గురించి చూపెట్టబోతోంది.

పార్ట్ 3

“RGV”
—ది ఇంటెలిజెంట్ ఇడియట్

ఇది ఆయన ఫేయిల్యూర్లు, వివాదాలు మరియు ఆయనకున్న దేవుళ్ళ పట్ల, సెక్స్ పట్ల , సమాజం పట్ల ఉన్న విపరీత వైఖరులతో పాటు చాలా మంది మీద ఆర్జీవీ ప్రభావం గురించి చూపెట్టబోతోంది .

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close