MOVIE NEWS

క‌‌ల‌ర్ ఫొటో చిత్ర‌ ఆల్బ‌మ్ నుంచి ఆగ‌స్ట్ 27న రానున్న మొద‌టి పాట “త‌ర‌గ‌తి గ‌ది”

క‌‌ల‌ర్ ఫొటో చిత్ర‌ ఆల్బ‌మ్ నుంచి ఆగ‌స్ట్ 27న రానున్న మొద‌టి పాట త‌ర‌గ‌తి గ‌ది
అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ పై శ్ర‌వ‌ణ్ కొంక‌, లౌక్య ఎంట‌ర్ టైన్మెంట్స్ స‌మ‌ర్ప‌ణ‌లో సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేని నిర్మాత‌లుగా సందీప్ రాజ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన చిత్రం క‌ల‌ర్ ఫొటో. ఈ సినిమాతో సందీప్ ద‌ర్శ‌కుడిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచయం అవుతున్నారు. ఈ చిత్రంలో సుహాస్, చాందీని చౌద‌రి జంట‌గా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ న‌టుడు సునీల్ కీల‌క పాత్ర పోషిస్తున్నారు. వైవా హ‌ర్ష మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. అమృత ప్రొడ‌క్ష‌న్ బ్యాన‌ర్ ద్వారా హృద‌య‌కాలేయం, కొబ్బ‌రి మ‌ట్ట వంటి సూప‌ర్ హిట్ కామెడీ ఎంట‌ర్ టైన‌ర్స్ ని అందించిన నిర్మాత సాయి రాజేశ్, ఇప్పుడు క‌ల‌ర్ ఫొటో చిత్రానికి క‌థ కూడా అందించ‌డం విశేషం. ఇటీవ‌లే క‌ల‌ర్ ఫొటో టీమ్ విడుద‌ల చేసిన టీజ‌ర్ కు ఆన్ లైన్ తో పాటు వివిధ వ‌ర్గాల ప్రేక్ష‌కుల నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించింది. ఈ మూవీ టీజ‌ర్ కు యూట్యూబ్ లో దాదాపుగా 3 మిలియ‌న్లుకు పైగా ఆర్గానిక్ పద్ధ‌తిలో వ్యూస్ వ‌చ్చాయి. ఇక ఈ చిత్రానికి కాల‌భైర‌వ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్ప‌టికే టీజర్ లో ఉన్న బ్యాక్ గ్రౌండ్ స్రోర్ వివిధ మ్యూజిక్ ఫ్లాట్ ఫామ్స్ తో ట్రెండ్ అవుతున్న‌ట్లుగా క‌ల‌ర్ ఫొటో యూనిట్ స‌భ్యులు చెబుతున్నారు.ఈ నేప‌థ్యంలో క‌ల‌ర్ ఫొటో మ్యూజిక్ ఆల్బ‌మ్ నుంచి మొద‌టి పాట‌ను విడుద‌ల చేయ‌డానికి చిత్ర బృందం ఏర్పాట్లు చేస్తోంది. త‌ర‌గ‌తి గ‌దిలో అంటూ మొద‌లైయ్యే ఈ పాట‌ను ఆగ‌స్ట్ 27 న ప్ర‌ముఖ మ్యూజిక్ కంపెనీ ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోష‌ల్ మీడియం ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విడుద‌ల చేస్తున్న‌ట్లుగా ఈరోజు జ‌రిగ‌న ప్రెస్ మీట్ లో చిత్ర బృందం ప్ర‌క‌టించింది.
ఈ సంద‌ర్భంగా హీరో సుహాస్ మాట్లాడుతూ
క‌మీడియ‌న్ గా న‌న్ను ఆద‌రిస్తున్న తెలుగు ప్రేక్ష‌కుల‌కి ఎల్లప్పుడూ రుణ ప‌డి ఉంటాను. నామీద ఎంతో న‌మ్మ‌కంతో నిర్మాత‌లు సాయిరాజేశ్ గారు, బెన్నీ గారు హీరోగా న‌న్ను ఇంట‌ర్ డ్యూస్ చేయ‌డానికి ముందుకొచ్చారు. దాంతో పాటే సాయి రాజేశ్ గారు ఈ సినిమాకి స్టోరీని కూడా అందిస్తున్నారు. ఇక డైరెక్ట‌ర్ సందీప్ తో నాకు ఎప్ప‌టి నుంచో స్నేహం ఉంది. ఈ సినిమా త‌రువాత సందీప్ ఇంకా మంచి పొజీష‌న్ కు వెళ్లాలి అని మ‌నఃస్పూర్తిగా కోరుకుంటున్నాను. ఓ అంద‌మైన, స్వ‌చ్ఛ‌మైన ప్రేమక‌థతో మా క‌ల‌ర్ ఫొటో రెడీ అయింది. ఇక మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ త‌న బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ తో ఈ చిత్రాన్ని మ‌రో మెట్టు పైకి ఎక్కేలా చేశారు. యాక్ట‌ర్ సునీల్ గారితో, మ‌న తెలుగమ్మాయి చాంద‌నీ చౌద‌రితో ఈ సినిమా లో స్క్రీన్ షేర్ చేసుకోవ‌డం చాలా ఆనంద‌గా అనిపించింది. ఆగ‌స్ట్ 27న ఆదిత్య మ్యూజిక్ అఫీషియల్ సోష్ల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా మా సినిమా పాట‌ల ఆల్బ‌మ్ నుంచి మొద‌టి పాట త‌ర‌గతి గ‌ది ని విడు‌ద‌ల చేస్తున్నాము అని అన్నారు.
డైరెక్ట‌ర్ సందీప్ రాజ్ మాట్లాడుతూ
యూట్యూబ్ లో నేను పోస్ట్ చేసిన వీడియోలను లైక్ చేస్తూ, పాజిటివ్ కామెంట్స్ పెడుతూ న‌న్ను ఎంక‌రేజ్ చేసిన ఆడియెన్స్ ఇప్పుడు డైరెక్ట‌ర్ గా నేను తీసిని తొలి సినిమా క‌ల‌ర్ ఫొటోను కూడా ఆదిరిస్తార‌ని ఆశిస్తున్నాను. డైరెక్ట‌ర్ గా నా తొలి సినిమా అయిన‌ప్ప‌టికీ నా స్నేహితుడు సుహాస్ హీరో కావడంతో నేను ఎలాంటి బెదురు, టెన్ష‌న్ లేకుండా సినిమా తెర‌కెక్కించాను. అలానే సినిమా నిర్మాత‌లు సాయిరాజేశ్, బెన్నీ ముప్పానేని షూటింగ్ స‌మ‌యంలో ఎంతో స‌పోర్ట్ చేశారు.  ఈ సినిమా క‌థ‌ను నిర్మాత సాయి రాజేశ్ గారు అద్భుతంగా, చాలా ఎమోష‌నల్ గా రెడీ చేశారు. స్టోరీలో ఉన్న మెయిన్ సోల్ ఎక్క‌డా మిస్ కాకుండా ఆడియెన్స్ ఆక‌ట్టుకునే రీతిన ఈ సినిమా ఆద్యంతం ఉంటుంది. మ్యూజిక్ డైరెక్ట‌ర్ కాల‌భైర‌వ మంచి ట్యూన్ ఇచ్చారు. ఆగ‌స్ట్ 27న మా సినిమా ఆల్బ‌మ్ నుంచి త‌ర‌గ‌తి గ‌ది అంటూ సాగిపోయే పాట‌ ఆదిత్య మ్యూజిక్ అఫీషియ‌ల్ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ ద్వారా విడుద‌ల అవ్వ‌బోతుందని అన్నారు.
హీరోయిన్ చాందినీ చౌద‌రి మాట్లాడుతూ
క‌ల‌ర్ ఫొటో టీజ‌ర్ కి ఆడియ‌న్స్ నుంచి అనూహ్య స్పంద‌న ల‌భించ‌డం చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఈ సినిమా స్టోరీ విన్న వెంటనే ఇందులో లేడీ క్యారెక్ట‌ర్స్ అన్నిటికి చాలా మంచి పేరు ల‌భిస్తుంద‌ని అనిపించింది. ఈ సినిమాలో న‌టించే అవ‌కాశం ఇచ్చిన నిర్మాత సాయిరాజేశ్, బెన్నీ గారికి ప్ర‌త్యేకంగా కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకుంటున్నారు. ద‌ర్శ‌క‌డు సందీప్, ఈ సినిమాలో నేను పోషించిన పాత్ర చాలా అద్భుతంగా తెర‌కెక్కించారు. ఈ సినిమాను ప్రేక్ష‌కులు ఆద‌రిస్తార‌ని మ‌నఃస్పూర్తిగా న‌మ్ముతున్నాను అన్నారు.
లైన్ ప్రొడ్యూస‌ర్ గంగాధ‌ర్ మాట్లాడుతూ
మెగాస్టార్ చిరంజీవిగారి అభిమానిగా సినిమాల్లోకి వ‌చ్చాను. నన్ను క‌ల‌ర్ ఫొటో సినిమాలో భాగ‌స్వామీగా చేర్చుకున్న నిర్మాత సాయిరాజేశ్ గారికి ఎల్లప్పుడూ ప్ర‌త్యేకంగా ధన్య‌వాదాలు తెలుపుతున్నాను. ఈ సినిమా క‌చ్ఛితంగా ప్రేక్ష‌కుల్ని అల‌రిస్తుంద‌ని న‌మ్ముతున్నాను.
ఈ కార్యాక్ర‌మంలో హీరో సుహాస్, హీరోయిన్ చాంద‌నీ చౌద‌రి, ద‌ర్శ‌కుడు సందీప్, లైన్ ప్రొడ్యూస‌ర్ గంగాధ‌ర్, కెమెరామేన్ వెంక‌ట్ త‌దిత‌ర చిత్ర యూనిట్ స‌భ్యులు పాల్గొన్నారు.
చిత్రం: కలర్ ఫోటో
బ్యానర్: అమృత ప్రొడక్షన్సమర్పణ: శ్రవణ్ కొంక, లౌక్య ఎంటర్త్సైన్మెంట్స్నటీనటులు: సుహాస్, చాందిని చౌదరి, సునీల్, వైవా హర్ష తదితరులునిర్మాతలు: సాయి రాజేష్ నీలం, బెన్నీ ముప్పానేనిర‌చ‌న‌, ద‌ర్శ‌క‌త్వం : సందీప్ రాజ్ కథ: సాయి రాజేష్ నీలంఆర్ట్: క్రాంతి ప్రియంకెమెరామెన్: వెంకట్ ఆర్ శాఖమురిఎడిటర్: కోదాటి పవన్ కళ్యాణ్ఫైట్స్: ఎ.విజయ్సహ నిర్మాత : మణికంఠలైన్ ప్రొడ్యూసర్ : గంగాధర్పీఆర్ఓ: ఏలూరు శ్రీను
First song from Colour Photo album, ‘Tharagathi Gadhi’  to be out on August 27th
Amrutha Productions previously scored blockbusters with spoof films like ‘Hrudaya Kaleyam’, and ‘Kobbari Matta’. The upcoming film from this production house is ‘Colour Photo’. Suhas, who carved a name for himself with films like Majili, Dear Comrade, and Prati Roju Pandage is playing lead role in ‘Colour Photo’. Chandini Chowdary is pairing up with Suhas in this film. Sandeep Raj is making his debut with this film. Kaala Bhairava is composing the tunes. The teaser that was released recently got a very good response and has clocked over 3 million views. The makers are now set to release the first song named ‘Tharagathi Gadhi’ from the audio album. The song will be out on August 27th on the official social media handles of Aditya Music.

Speaking on the occasion, hero Suhas said, “I will be forever indebted to Telugu audience who have accepted me as a comedian. I am thankful for Sai Rajesh and Benny who placed their trust in me and are producing the film. Sai Rajesh is also providing the story for the film. I have a very good relationship with the director Sandeep Raj and we have traveled together for a long time now. I hope he reaches greater heights with this film. Colour photo us a beautiful and pure love story, which is elevated to a new level with Kala Bhairava’s background score and songs. Feel glad to have shared the screen space with Sunil garu and my fellow Telugu co-star Chandini Chowdary. We are releasing the first song from our album on August 27th, through the official social media handles of Aditya Music.
The director Sandeep Raj said, “Telugu audience have always supported me as they kept encouraging me rights from the early stages of my career when I used to post short videos on YouTube. I hope they support my debut film Colour Photo as well. Suhas is a very good friend of mine and I did not take much pressure while working on the film as I had him by my side. The producers Sai Rajesh and Benny were ever so supportive on the sets and it was a pleasant experience working with them. Sai Rajesh garu penned a gripping and emotional story for this film and we made it with utmost sincerity and care. The first song from the album will be out on August 27th.”
Banner: Amrutha ProductionsPresented by: Sravan Konka, Loukya EntertainmentsCast: Suhas, Chandini Chowdary, Sunil, Viva HarshaProducers: Sai Rajesh Neelam, Bunny MuppaneniStory: Sai Rajesh NeelamArt: Kranthi PriyamCinematography: Venkat R Editor: Kodati Pawan KalyanFights: A VijayCo-producer: ManikantaLine producer’ GangadharPRO: Eluru Sreenu

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close