Gossips

నటుడు శివబాలాజీ సతీమణి మధుమిత పుట్టినరోజు వేడుకలు!

నటుడు, బిగ్ బాస్ టైటిల్ విన్నర్ శివబాలాజీ సతీమణి మధుమిత పుట్టినరోజు వేడుకలను ఫామ్ హౌస్ లో జరుపుకున్నారు.
మార్చి నుండి లాక్ డౌన్ …. లాక్ డౌన్ టైమ్ లో మధుమిత తన ఫేస్ బుక్ , ఇన్స్ టాగ్రామ్ లో తన వంటల వీడియోస్ పోస్ట్ చేయగా అనేకమంది అభిమానులు వారిని యూట్యూబ్ ఛానెల్ ను ఆరంభించవలసినదిగా కోరగా, శివబాలాజీ దంపతులు సొంతంగా ఒక యూట్యూబ్ ఛానెల్ ప్రారంభించి అందులో వంటల ప్రోగ్రామ్ స్టార్ చేశారు. ఈ కరోన టైమ్ లో వంటల ప్రోగ్రామ్ తో మరింతమందికి చేరువయ్యారు.

వీరి వంటల వీడియోలలో వీరు షేర్ చేసుకుంటున్న గడిచిన కాలపు జ్ఞాపకాలకు ఆడియన్స్ నుండి, సినీ పరిశ్రమ నుండి ప్రసంశలు లభించాయి. మధుమిత, ప్రసవం తరువాత తీసుకోవలసిన జాగ్రత్తల గురించి చేసిన వీడియోలకు వ్యూయర్స్ ఎమోషనల్ గా అటాచ్ అయ్యారు, ఇలాంటి ఒక టాపిక్ మీద ఇంత డీటైల్డ్ గా వీడియో చేసినందుకు ప్రశంసల వర్షం కురిపించారు, ఈ వీడియో తమకు ఎంతో ఉపయోగ పడుతుందని చాలామంది మహిళలు అన్నారు. ఈ వీడియో చేయడానికి సపోర్ట్ గా నిలిచిన శివబాలాజికి కూడ ధన్యవాదాలు తెలిపారు…

కరోన పెరుగుతున్నా, జనాల్లో భయం ఉన్నా సరే వీరి ప్రోగ్రామ్ కోసం కొంతమంది ఆడియన్స్ వేచి చూస్తున్నారు. కరోన టైమ్ లో చాలా మంది ఈ ప్రోగ్రామ్ వల్లా రిలీఫ్ అయ్యామని అంటున్నారు, పాజిటివిటి పంచుతున్నందుకు శివబాలాజీ దంపతులను ఇంకా అభిమానిస్తున్నారు
ఈ వంటల ప్రోగ్రామ్ కారణంగా ఎక్కువ మంది మగవారు కూడా వంటలు నేర్చుకోవడం విశేషం.
మధుమిత పుట్టినరోజు సందర్భంగా వారి ఫామ్ హౌస్ లో ఉన్న వారికి చుట్టుపక్కల వర్కర్స్ కు శివబాలాజీ దంపతుడు వారి చేత్తో చేసిన ఫుడ్ వడ్డించడం జరిగింది.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close