NEWS

గౌరవనీయులైన మా అన్న గారు శ్రీ చదలవాడ శ్రీనివాసరావు గారికి మీ తమ్ముడు రమేష్ బాబు నమస్కారాలతో వ్రాయునది..

తిరుపతి లో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఎలాగైతే భక్తులను కాపాడుకుంటారో అలాగే మీరు కూడా కరోనా సమయంలో అల్లాడుతున్న సినీ కార్మికుల కి అన్ని భాగాలకి కలిపి సమానంగా చూసి సహయపడుతున్నారు. నాకు తెలిసి దగ్గర దగ్గరగా 55 లక్షల రూపాయలను సహాయం అందించారు. తెలుగు సినీ ఇండస్ట్రీలో ఏ నిర్మాత కూడా చేయని ఆర్థిక సహాయాన్ని మీరు చేశారు. ఈ రోజుల్లో మీరు చేసిన సహాయం చాలా మంది సినీ కార్మికులకు ఎంతగానో ఉపయోగపడింది. కానీ మీరు ఇంత చేసినా కూడా ఒక్క ఫోటోకి కూడా సహకరించకపోవడం ఆశ్చర్యకరం. అదే మీ దయ.

అలాగే ఆరోగ్యం క్షీణించి కరోనాతో బాధపడుతున్నా నాకు అడిగిన వెంటనే సహాయం అందించారు. మీకు ఫోన్ చేసిన వెంటనే రమేష్ భయపడకు నేను ఉన్నాను అంటూ భరోసా ఇచ్చారు. వెంటనే మాతృదేవో భావ డైరెక్టర్ కె.అజయ్ కుమార్ గారితో అలాగే TFPC సెక్రటరీస్ ప్రసన్న కుమార్ – మోహన్ వడ్లపట్ల, రామ సత్యనారాయణ, ద్వారా మీరు మాకు తక్షణ ఆర్థిక సహాయంగా 55,555.55రూపాయలు అందించారు. ఈ సహాయం చేసినందుకు మీరు మీ కుటుంబ సభ్యులు ఆరోగ్యంగా సంతోషంగా జీవితకాలం ఐశ్వర్యంతో ఉండాలి. ఆ దేవుడు మీకు ఇంకా లక్షల కోట్ల ఆదాయం ఇవ్వాలని అలాగే మీరు ఇంకా చాలా మందికి ఇదే విధంగా సహాయ పడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే నిరంతరం మీ విజాయాన్ని కోరుకుని.. మీతో నడిచే మీ తమ్ముడు డి.రమేష్ ప్రసాద్.. మీకు నమస్కారాలతో..

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close