MOVIE NEWS

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే, బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ కాంబినేష‌న్ లో జిఏ2 పిక్చ‌ర్స్ ” మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” రొమాంటిక్ పోస్టర్ విడుదల

అఖిల్ అక్కినేని హీరోగా మెగా ప్రొడ్యూస‌ర్ అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ పై తెర‌కెక్కుతున్న చిత్రం “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్”. టాలెంటెడ్ డైరెక్టర్ బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ లో రెడీ అవుతున్న ఈ సినిమాకి టాలీవుడ్ లో వ‌రుస‌గా భ‌లేభ‌లేమ‌గాడివోయ్‌, పిల్లానువ్వులేని జీవితం, గీతాగోవిందం, ప్ర‌తిరోజు పండ‌గే లాంటి బ్లాక్‌బ‌స్ట‌ర్స్ తో  మోస్ట్ సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ గా క్రేజ్ ని సొంతం చేసుకున్న‌ బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మ తో కలిసి నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ లో అఖిల్ అక్కినేని సరసన బుట్టబొమ్మ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. ఇది ఇలా ఉంటే “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్” సినిమా అనౌన్స్‌  దగ్గర నుంచి అక్కినేని అభిమానుల్లో ఫుల్ క్రేజ్ ఏర్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్‌ టీం విడుదల చేసిన అఖిల్ అక్కినేని ఫస్ట్ లుక్ కు,  అలానే  గొపిసుంద‌ర్ సంగీత‌సార‌ధ్యంలో హ్యాపెనింగ్ స్టార్ సింగర్ సిద్ శ్రీరామ్ పాడిన మనసా మ‌న‌సా పాటకు అటు సోషల్ మీడియా లో ఇటు అభిమానుల్లో అనూహ్యమైన స్పందన లభించడం యూనిట్ లో కొత్త ఉత్సాహ‌న్ని తెచ్చింది. ఇదే ఉత్సాహంతో అక్కినేని అభిమానులకు స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ యూనిట్ తాజగా ఈ సినిమాకు సంబంధించిన  రొమాంటిక్ పోస్టర్ ని విడుదల చేసింది.

అఖిల్‌ అక్కినేని తో రొమాన్స్ చేస్తున్న పూజా హెగ్డే

ఈ రోజు విడుద‌ల చేసిన పోస్ట‌ర్ లో అక్కినేని న‌ట‌వార‌సుడు అఖిల్ అక్కినేని వర్క్ చేసుకుంటూ ఉంటే వెనక నుంచి బుట్ట బొమ్మ పూజా హెగ్డే టీజ్ చేసే ఈ స్టిల్ చూస్తే ప్ర‌తిఓక్క‌రిలో ఒక తెలియ‌ని రొమాంటిక్ ఫీల్ వ‌స్తుంది. ద‌ర్శ‌కుడు బొమ్మ‌రిల్లు భాస్క‌ర్ త‌న చిత్రాల్లోని పాత్ర‌ల్ని చాలా క్యూట్ రొమాన్స్ తో ల‌వ్ లీగా వుండే కేర‌క్ట‌ర్స్ గా డిజైన్ చేస్తారు. అందుకే ఆయ‌న చిత్రాల‌కి ఒ స్పెషాలిటి వుంటుంది. అఖిల్ అక్కినేని ,పూజా ల మ‌ద్య ఎలాంటి కెమిస్ట్రి ఈ చిత్రం లో  వుండ‌బోతుందో ఈ పోస్ట‌ర్ డిజైనింగ్ లో చాలా చ‌క్క‌గా, అందంగా చూపించారు ద‌ర్శ‌కుడు భాస్క‌ర్‌.

రొమాంటిక్‌ ఫ్యామిలి ఎంట‌ర్‌టైన‌ర్ గా మెస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్ ల‌ర్ రెడి అవుతున్నాడు.

ఇప్ప‌టికే 70% పూర్త‌య్యి రొమాంటిక్ ఫ్యామిలి ఎంటెర్టైనెర్ గా తెర‌కెక్కుతున్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఒక షెడ్యూల్ మిన‌హ‌ షూటింగ్ మెత్తాన్ని పూర్తిచేసుకుంది. ఈ కరోనా క్రైసిస్ కొంచెం త‌గ్గితే ఈ షెడ్యూల్ ని కూడా అతిత్వ‌ర‌లో ప్లాన్ చేస్తున్నారు. అఖిల్ అక్కినేని మ‌రియు పూజా లు షూటింగ్ కి సిద్దంగా వున్నా బ‌య‌ట‌ ప‌రిస్థితులు దృష్ట్యా నిర్మాతలు బన్నీ వాసు, వాసు వర్మ లు ఈ నిర్ణ‌యాన్ని తీసుకున్నారు.  ఇప్పటికే కీలకమైన సన్నివేశాలతో పాటు దాదాపు టాకీ షూటింగ్ పూర్తి అయ్యినట్లుగా నిర్మాతలు తెలిపారు. ఈ లాక్ డౌన్ లో గొపిసుంద‌ర్ తో మ్యూజిక్ కార్య‌క్ర‌మాలు పూర్తిచేశారు. అలాగే అతి త్వ‌ర‌లో డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మెద‌లు పెట్ట‌బోతున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రోడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. ఆమని, మురళి శర్మ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి 2021 లో జ‌న‌వ‌రి పొంగ‌ల్ కి విడుద‌ల చేయటానికి నిర్మాతలు స‌న్నాహ‌లు చేస్తున్నారు.

న‌టీ న‌టులు

అఖిల్ అక్కినేని
పూజా హెగ్ఢే
ఆమ‌ని
ముర‌ళి శ‌ర్మ‌
జ‌య ప్ర‌కాశ్
ప్ర‌గ‌తి
సుడిగాలి సుధీర్
గెటెప్ శ్రీను
అభ‌య్
అమిత్

సాంకేతిక నిపుణులు..
  బ్యానర్ : జీఏ2 పిక్చ‌ర్స్    స‌మ‌ర్ప‌ణ : అల్లు అర‌‌వింద్  మ్యూజిక్ : గోపీ సుంద‌ర్
సినిమాటోగ్రాఫీ : ప్ర‌దీశ్ ఎమ్ వ‌ర్మ
ఎడిట‌ర్ : మార్తండ్ కే వెంక‌టేశ్
ఆర్ట్ డైరెక్ట‌ర్ : అవినాష్ కొల్లా
పి ఆర్ ఒ..ఏలూరు శ్రీను  నిర్మాత‌లు : బ‌న్నీ వాసు, వాసు వ‌ర్మ‌  
డైరెక్ట‌ర్ : బొమ్మ‌రిల్లు భాస్క‌ర్

 Romantic look poster of ‘Most Eligible Bachelor’ Starring Akhil Akkineni, and Pooja Hegde, and directed by  Bommarillu Bhaskar, produced by GA2 Pictures out now

Starring Akhil Akkineni in the lead role and presented by Allu Aravind, ‘Most Eligible Bachelor’ is being directed by Bommarillu Bhaskar. Bunny Vas who scored multiple blockbusters like Bhale Bhale Magadivoi, Pilla Nuvvu Leni Jeevitham, Geetha Govindam, and Prathi Roju Pandage is producing the film. Noted director-producer Vasu Varma is co-producing the film. Butta Bomma Pooja Hegde is romancing Akhil Akkineni in the film. A new poster of the film was released today and it is gaining a good response from netizens.

Pooja Hegde romancing Akhil Akkineni

The poster which was released today shows Pooja Hegde teasing Akhil. It has a romantic vibe to it. Bommarillu Bhaskar who is known for making feel good love stories is in his elements with ‘Most Eligible Bachelor. Akhil looks dynamic in the poster and he depicts an ideal bachelor. Pooja Hegde is at her usual best and adds a glamorous touch to the poster. Their pairing is eye-catching.

‘Most Eligible Bachelor’, a lovely family entertainer

Over 70% of the film has been shot already and just a schedule is remaining. The shoot will resume once the Covid-19 effect is nullified. Gopi Sundar is working on the soundtrack during the lockdown period. Post production works are underway. Also, the poster indicates that the film is up for 2021 Pongal release.

Star cast:

Akhil Akkineni
Pooja Hegde
Aamani
Murali Sharma
Jaya Prakash
Pragathi
Sudugaali Sudheer
Get-up Sreenu
Abhay
Smith

Technical team

Director: Bommarillu Bhaskar
Music: Gopi Sundar
Cinematography: Pradeep M Sharma
Art director: Avinash Kolla
Producers: Bunny Vas, Vasu Varma
Presented by: Allu Aravind
Banner: GA2 Pictures

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close