MOVIE NEWS

సానా యాదిరెడ్డి దర్శక నిర్మాతగా 2004లో జరిగిన యదార్ధ ప్రేమకథా చిత్రం ‘నువ్వంటే నేనని’

తెలుగు సినీ ప్రేక్షకులకు సుప్రసిద్ధ నిర్మాణ సంస్థ సానా  క్రియేషన్స్ బ్యానర్ ని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సానా  యాది రెడ్డి దర్శక నిర్మాతగా  ‘పిట్టల దొర’ బ్యాచిలర్స్ , సంపెంగి, ప్రేమ పల్లకి,  జై బజరంగభళి వంటి స్మాల్ బడ్జెట్ తో తీసిన మూవీస్ మ్యూజికల్ గా పెద్ద సక్సెస్ లు సాధించాయి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందునుండే  తెలంగాణ ప్రాంతానికి చెందిన కళా కారులను సినీ పరిశ్రమకు పరిచయం చేసిన ఘనత  దర్శక నిర్మాత సానా  యాదిరెడ్డి కె చెందుతుంది. ఇక విషయానికొస్తే…..  2004వ సంవత్సరం హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల  ఆధారంగా తయారు చేసుకున్న సరి కొత్త ప్రేమకథ తో ఎన్నో ఏళ్ళ గ్యాప్ తరువాత మళ్ళీ  మీ ముందుకొచ్చారు సాన యాది రెడ్డి. గత ఏడాది షూటింగ్ ఇతర కార్యక్రమాలను పూర్తి చేసుకుని  కరోనా క్రైసిస్ కి ముందుగానే ఫస్ట్ కాపీ రెడీ చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా వుంది.
ఈ సందర్భంగా దర్శక నిర్మాత సానా యాది రెడ్డి మాట్లాడుతూ – ” తెలుగు ప్రేక్షకులు  పీరియాడికల్, బయోపిక్  చిత్రాలను ఆదరిస్తారని ఇటీవల సక్సెస్ సాధించిన  ‘రంగ స్థలం’  ‘మహా నటి’ ‘జార్జి రెడ్డి’ ‘యాత్ర’ వంటి చిత్రాలు నిరూపించాయి. అదే స్ఫూర్తి తో నేను ఓ కథ రెడీ చేశాను. 2004  హైదరాబాద్ లో జరిగిన ఓ యదార్ధ సంఘటనల  ఆధారంగా రాసుకున్నసరి కొత్త ప్రేమకథను తెరకెక్కిచాను.  నా బ్యానర్ ద్వారా అప్పట్లో కమెడియన్ గా చేస్తున్న అలీ ని పెట్టి  ‘పిట్టల దొర’ గా, సంపెంగి చిత్రంతో  హీరో హీరోయిన్ లు గా దీపక్, కాంచి కౌల్ ని, బ్యాచిలర్స్ సినిమాతో శివాజీ వంటి హీరోను పరిచయం చేయడం జరిగింది. ఇప్పడు మళ్ళీ నూతన హీరో హీరోయిన్లతోనే  ‘నువ్వంటే నేనని’ అనే చిత్రాన్ని నిర్మించాను. అదే విధంగా వరికుప్పల యాదగిరిని పాటల రచయితగా నా చిత్రాల ద్వారానే  పరిచయం చేశాను. ఇప్పుడు ఈ చిత్రంతో అతన్ని మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేస్తున్నాను. ఈ సినిమాకి అతని పాటలు  ఓ  హైలెట్ గా నిలుస్తాయి. గత ఏడాది షూటింగ్ పార్ట్ పూర్తి చేసి,  ఈ ఏడాది జనవరి లో మా చిత్రానికి సంబంధించిన ఫస్ట్ కాపీ రెడీ చేసాం. అయితే  జనవరిలో పెద్ద సినిమాల రిలీజ్ లు వుంటాయని విడుదల కార్య క్రమాలు నిలిపి వేసాము. పైగా ఈ సినిమాలో ముఖ్యంగా యూత్ ని ఆకట్టుకునే ఎలిమెంట్ ఎక్కువగా వున్నాయి అందుకనే పరీక్షలు అయిపోయాకా అప్పుడే ప్రమోషన్ స్టార్ట్ చేసి రిలీజ్ చేద్దామని ప్లాన్ చేశాను కానీ కుదరలేదు. కరోనా మహమ్మారితో  ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కుంటున్నపరిస్థితిలో లాక్ డౌన్ పెట్టడం, ప్రజలు భయాందోళనలతో వున్నా సమయంలో థియేటర్ కి వచ్చి సినిమా చూసే  అవకాశం లేకపోవడం,  పైగా రోజు రోజుకి కరోనా కేసులు ఉధృతంగా పెరిగిపోతున్నా ఈ సమయంలో థియేటర్లు, మల్టి ఫ్లెక్సులు ఈ ఏడాది ఆఖరు వరకు కూడా  తెరిచే అవకాశం లేదని సినిమా పెద్దలు చెప్పగా, మా  సినిమాని నేరుగా ఇంట్లోనే కుటుంబ సమేతంగా చూసే విధంగా  ఓ టి టి ద్వారా విడుదల చేయాలనీ భావించాను. నా గత చిత్రాలను ఆదరించారు అదే విధంగా నా తాజా చిత్రం ‘నువ్వంటే నేనని’ ని కూడా చూసి  ఆనందిస్తారని ఆశిస్తున్నాను”అన్నారు.  నటీనటులు : నకుల్, శ్వేతా (నూతన  పరిచయం) చంద్ర మోహన్, దువ్వాసి మోహన్, ‘చిత్రం’ శ్రీను  తదితరులు  
సాంకేతిక నిపుణులు:
కథ : పరమేష్ – రామ్ కుమార్,
మాటలు: పోలూరు ఘటికా చలం
కెమెరామెన్: విజయ్. సి .కుమార్,
పాటలు, సంగీతం : వరికుప్పల యాదగిరి
ఎడిటర్: రమేష్,
డాన్స్ : స్వర్ణ – దివ్య
ఫైట్స్ : RAM – LAXMAN
పి ఆర్ ఓ : రాంబాబు వర్మ  
నిర్మాత : సానా   భాగ్య లక్ష్మి
కాన్సెప్ట్ , స్క్రీన్ ప్లే, దర్శకత్వం : సానా  యాదిరెడ్డి‘Nuvvante Nenani’ Produced And Directed By Sana Yaadireddy Is Based On A True Lovestory Happened In 2004
Sana Creations Banner needs no introduction for Telugu audience. Sana Yadireddy Produced and Directed films like, ‘Pittaladora’, ‘Bachelors’,’Sampangi’,’Prema Pallaki’,’Jai Bhajarangabhali’ which turned out to become Big Musical Hits. Sana Yadireddy used to introduce many talented Telangana artists even before the formation of Telangana state.  After a gap, Sana Yadireddy is back with a New Lovestory based on real events happened at Hyderabad in 2004. The shooting part and other works have been completed last year. The first copy has been readied before Corona Crisis. 

On this occasion Producer, Director Sana Yadireddy said, ” It is proved that Telugu audience will love periodical and biopics with the success of ‘Rangasthalam’, ‘Mahanati’, ‘George Reddy’ and ‘Yatra’ movies. I have readied a subject with that inspiration. Based on the true events took place at Hyderabad in 2004 I have made this film as a brand new lovestory. I introduced then Comedian Ali as a Hero with ‘Pittaladora’, Deepak and Kanchi Kaul with ‘Sampangi’ and Sivaji with ‘Bachelors’. Now I introduced new talent as Hero and Heroines with ‘Nenante Nuvvani’. I introduced Varikuppala Yadagiri as lyricist with my films. Now I am introducing him as a Music Director with this film. His tunes will be a major highlight of this film. We have completed shooting part last year and readied the first copy by January this year. But, due to Big films in January we have hold the release of our film. As this film has many youthful elements and so we wanted to promote it and release after the exams in summer season. Due to the Corona Pandemic there is no situation to screen films in theatres and also it is being said that the chance of re-opening theatres is very slim this year. So, I opted to release the film in OTT so that entire family can enjoy the film at their home only. The audience gave big successes to my previous films and I hope they will make ‘Nuvvante Nenani’ too a big success.”
Cast:Nakul, Shwetha (Introducing), Chandramohan, Duvvasi Mohan, ‘Chitram’ Srinu and others
Crew:Story: Paramesh – RamkumarDialogues: Poluru GhatikachalamCameraman: Vijay C KumarLyrics, Music: Varikuppala YadagiriEditor: RameshDance: Swarna – DivyaFights: Ram – LaxmanPRO: Rambabu VarmaProducer: Sana BhagyalakshmiConcept, Screenplay, Direction: Sana Yadireddy 

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close