MOVIE NEWS

Star director Harish Shankar launches the first look poster of talented hero Kiran Abbavaram’s ‘Sebastian P.C 524″

Kiran Abbavaram who made his debut with ‘Raja varu Rani garu’ will next be seen in “S.R Kalyanamandapam Est. 1975”. Elite Entertainments which is bankrolling Kiran Abbavaram’s second film will also be producing his next film which has been titled ‘Sebastian P.C 524’. Pramod and Raju are producing this film. Balaji Sayyapureddy is directing it and this will be his directorial debut. On the occasion of Kiran Abbavaram’s birthday (July 15th), the makers have released the first look poster of ‘Sebastian P.C 524’. Star director Harish Shankar released this first look poster through online mediums. Kiran Abbavaram will be seen as a police constable in this film and he will have a medical condition pertaining to night blindness. Viplav is the editor and Raj K Nalli will be handling cinematography. More details about the project will be out soon, say the producers Pramod and Raju.
Cast: Kiran Abbavaram
Technical team:
Banner: Elite Entertainments
Producers: Pramod – Raju
Cinematography: Raj K Nalli
Editor: Viplav Naisadam
PRO: Eluru Sreenu
Director: Balaji Sayyapureddy
స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ చేతుల మీదుగా యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం “సెబాస్టియ‌న్ P.C. 524” ఫ‌స్ట్ లుక్ విడుద‌ల‌
“రాజావారు రాణిగారు” చిత్రంతో చిత్ర సీమ‌కు ఎంట్రీ ఇచ్చి ప్ర‌స్తుతం వ‌రుస సినిమాల‌తో క‌మిట్ అవుతూ ప్రేక్ష‌కుల్ని ఎంట‌ర్ టైన్ చేయ‌డానికి సిద్ధం అవుతున్నారు యంగ్ టాలెంటెడ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వరం. ఇప్ప‌టికే కిర‌ణ్ త‌న రెండో సినిమాగా “ఎస్ ఆర్ క‌ళ్యాణ‌మండ‌పం Est. 1975” లో న‌టిస్తున్నారు. ఈ సినిమాను నిర్మిస్తున్న ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ వారితోనే  తాజాగా “సెబాస్టియ‌న్ పి.సి 524” అనే ప్రాజెక్ట్ లో న‌టించేందుకు గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు. దీంతో కిర‌ణ్ అబ్బ‌వ‌రం, ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్ కాంబినేష‌న్ లో మ‌రో వినూత్న‌మైన సినిమా రెడీ అవుతుంది. ఈ సినిమాకి నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. బాలాజీ సయ్యపురెడ్డి ఈ సినిమాతో ద‌ర్శ‌కునిగా తెలుగు చిత్ర సీమ‌కు ప‌రిచ‌యం అవుత‌న్నారు. ఇది ఇలా ఉంటే కిర‌ణ్ అబ్బ‌వరం పుట్టిన రోజు(జూలై 15న‌) సంద‌ర్భంగా “సెబాస్టియ‌న్ పి.సి. 524” ఫ‌స్ట్ లుక్ ని రెడీ చేసింది చిత్ర బృందం. స్టార్ డైరెక్ట‌ర్ హ‌రీశ్ శంక‌ర్ ఈ ఫ‌స్ట్ లుక్ ని ఆన్ లైన్ లో విడుద‌ల చేశారు. ఈ చిత్రంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోలీస్ కాన్సిస్టేబుల్ గా న‌టిస్తున్నారు. ఇదే థీమ్ తో ఫ‌స్ట్ లుక్ ని సైతం చిత్ర బృందం సిద్ధం చేసింది. అలానే ఈ సినిమాలో హీరో రే చీక‌టి (నైట్ బ్లైండ్ నెస్ తో ) బాధ‌ప‌డుతుంటాడ‌నే వివ‌రాన్ని కూడా ఫ‌స్ట్ లుక్ ద్వారా తెలియ‌జేశారు. ఇక ఈ సినిమాకి ఎడిట‌ర్ గా విప్ల‌వ్, సినిమాటోగ్రాఫ‌ర్ రాజ్ కే న‌ల్లి వ్య‌వ‌హ‌రిస్తున్నారు. సెబాస్టియ‌న్ కి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు, త్వ‌ర‌లోనే తెలియ‌జేస్తామ‌ని నిర్మాత‌లు ప్ర‌మోద్, రాజులు తెలిపారు.

తారాగ‌ణం
కిర‌ణ్ అబ్బ‌వ‌రం
సాంకేతిక వ‌ర్గం
బ్యాన‌ర్ : ఎలైట్ ఎంట‌ర్ టైన్మెంట్స్
నిర్మాత‌లు : ప్ర‌మోద్ – రాజు
కెమెరా : రాజ్ కే న‌ల్లి
ఎడిట‌ర్ : విప్ల‌వ్ నైశా‌దం
పీఆర్ఓ : ఏలూరు శ్రీను
డైరెక్ట‌ర్ : బాలాజీ సయ్యపురెడ్డి

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close