
MOVIE NEWS
“Mister Lonely” movie poster launched matter and stills
ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ నేతృత్వంలో రూపొందుతున్న మిస్టర్ లోన్లీ చిత్ర పోస్టర్ ను విశాఖ ఎంపీ, సినీ ప్రొడ్యూసర్ ఎం.వి.వి.సత్యనారాయణ ఆవిష్కరించారు.ఈ చిత్ర నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ, డైరెక్టర్ ముక్కి హరీష్ కుమార్ సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ ఎం వి వి సత్యనారాయణ మాట్లాడుతూ ఈ చిత్రం విజయం సాధించాలని, కథాంశం అందరినీ ఆకట్టుకుంటుందని అభిప్రాయపడ్డారు. నిర్మాత కాండ్రేగుల ఆదినారాయణ మాట్లాడుతూ యువతను ఆకట్టుకునే కథతో, కాలేజ్ నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ చిత్రం అన్ని వర్గాల ప్రజలను కచ్చితంగా ఆకట్టుకుంటుంది. ఇటీవల రిలీజ్ చేసిన టీజర్ కు విశేషమైన ఆదరణ లభించింది అన్నారు.ఈ చిత్ర సినిమాటోగ్రాఫర్ ఆనంద్ గారా, నటీనటులు విక్కీ, , కియారెడ్డి , సోనాలి వర్ధమ్, లోహిత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.