
ఈ రోజు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారి జన్మదినం సందర్భంగా అమ్మ ఫాండషన్ లో ఉన్న పిల్లలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది
నందమూరి వంశం అటు తెలుగు జాతికి, చిత్రపరిశ్రమకు ఎంతో సేవచేసిందని అదే విధంగా ప్రజలు కూడా వారిని అంతకంటే ఎక్కువ స్థాయిలో ఆశీర్వదించి అండగా నిలిచారని జిల్లా బాలయ్య & మోక్షజ్ఞ ఫాన్స్ నగర టీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ అన్నారు , ఈ రోజు హీరో నందమూరి కళ్యాణ్ రామ్ గారి జన్మదినం సందర్భంగా శ్రీకాకుళం జిల్లా తారకరామా & మోక్షజ్ఞ సేవా సంఘం ఆధ్వర్యం లో స్థానిక 1 వ డివిజన్ బలగ లో గల అమ్మ ఫాండషన్ లో ఉన్న పిల్లలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు అందించడం జరిగింది , ముందుగా” కళ్యాణ్ రామ్ గారి” బర్త్ డే కేకును ఫాండషన్ లో ఉన్న పిల్లలు కట్ చేసి వెంకటేష్ కు తినిపించగా , తరువాత వెంకటేష్ వాళ్లకు కేక్ తినిపించారు , అనంతరం ఆయన మాట్లాడుతూ తెలుగు చిత్రసీమలో నందమూరి వంశానికి ప్రత్యేక గౌరవం , గుర్తింపు ప్రేక్షక దేవుళ్ళు ఇచ్చారని వారు నందమూరి వంశం ద్వారా రాష్ట్రానికి ,”అన్న ఎన్టీఆర్ గారిని” ముఖ్యమంత్రి గా చేసి గొప్ప స్థాయిలో ఆ వంశాన్ని ఆదరించారని నందమూరి వంశం నుండి అన్న NTR గారిని , హరికృష్ణ గారిని, బాలయ్య బాబు గారిని, Jr, ఎన్టీఆర్ గారిని , కల్యాణ్ రామ్ గారిని , తారకరత్న గారిని ఆదరించారని ఈ రోజు జన్మదినం జరుపుకుంటున్న కళ్యాణ్ రామ్ గారు ” అతడొక్కడే ” లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో చిత్ర రంగం మరియు ప్రేక్షక దేవుళ్ల ఆదరాభిమానాలు చూరగొని , పటాస్, ఇజం, 118″ తదితర విభిన్న చిత్రాలలో నటించి చిత్రరంగం లో తనకంటూ ఒక ప్రత్యేక స్తానం సంపాదించి ప్రేక్షకులు మెచ్చిన హీరో గా పేరు తెచ్చుకున్నారని , రాబోయే రోజుల్లో ఆయన మరెన్నో మంచి విజయాలు సాధించాలని , ఆభగవంతుడు ఆయనకు ఆయారారోగ్యాలు ప్రసాదించాలని, ప్రేక్షక దేవుళ్ళు ఆశీస్సులు ఆయనకు ఎపుడు ఉండాలని కోరుకుంటున్నామన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో , నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి చిట్టి నాగభూషణం , జిల్లా బాలకృష్ణ ఫాన్స్ ప్రధాన కార్యదర్శి గొర్లె వెంకటరమణ , కార్యదర్శి , సురకాశి వెంకటరావు , జిల్లా జూనియర్ NTR ఫాన్స్ అధ్యక్షులు దుంగ శ్రీధర్ , జిల్లా తారకరామా & మోక్షజ్ఞ సేవా సంఘం సభ్యులు ప్రదీప్ , గద్దె సుభాష్ , శిల్లా సురేంద్ర , దేవా, దశరధ్ దిలీప్ , అమ్మా ఫాండషన్ నిర్వాహుకులు ఉత్తమ్ గారు తదితరులు పాలుగున్నారు