MOVIE NEWS

సినీ పరిశ్రమ కు దూరమైనా నటనకు దూరం కాలేదు – ఇషాచావ్లా

అనేక తెలుగు చిత్రాల్లో టాలెంట్ నటిగా గుర్తింపు తెచ్చుకున్న ఇషాచావ్లా మళ్లీ నటిగా బిజీగా మారుతోంది.
తాజాగా ఆమె న్యూలుక్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. చాలా రోజుల గ్యాప్ తర్వాత ఆమెను చూసినవారు , తెలుగులో కథానాయికల లోటు తీరుతుందని చెబుతుండడం విశేషం!
ఈ విషయాన్నే ఆమెనే అడిగితే చాలా విశేషాలు చెప్పుకొచ్చారు. ” ఔనండీ ! చాలామంది అదే అడుగుతున్నారు. ఎక్కడకు వెళ్లారని! ఈ లాక్ డౌన్ పీరియడ్ లో అందరిలా నేనూ ముంబైలో స్ట్రక్ ఐపోయాను. మొనాటనీని అధికమించాలని ఈమధ్య ఆయుర్వేదం కోర్సులో అడ్మిషన్ తీసుకున్నాను. పనిలో పనిగా యోగా ప్రాక్టీసులో మరింత ఉన్నతి సాధించాను. యోగా ద్వారా అనేక మందిని ఈ కరొన సమయంలో మోటివేట్ చేసే అవకాశం వచ్చింది. నే నేర్చుకున్నది సద్వినియోగం అయింది. ఇది నాకు ఎంతో ఆనందం ఇచ్చిన విషయం.
ఖాళీ సమయాలలో వంటలు చేయడం, పుస్తకాలు చదవడం, మనసుకు నచ్చే సంగీతం వినడంతో ఉత్సాహం అనిపించింది. ఉదయాన్నే నిద్ర లేచి, సూర్యోదయం, సాయంత్రం సూర్యాస్తమయం చూస్తూ మన చుట్టు ఉన్న నేచర్ గొప్పతనం చూసి సంతోషం పొందాను. సాయంత్రాలు ఓ కప్పు టీ తాగుతూ పొందే ఆనందం చెప్పనలవి కాదు.
వీటితో పాటు నే 2017 లో ప్రారంభించిన అనన్య ఫౌండేషన్ ద్వారా అనేక మంది ప్రత్యేక అవసరాలు గల వారికి సేవలు అందిస్తున్నాం. అదీ కాక స్ట్రస్ తో బాధ పడేవారికి , ఏదో ఆలోచనలతో బాధ పడుతూ కౌన్సిలింగ్ అవసరమైన వారికి , వారికి తగిన విధంగా ఈ ఫౌండేషన్ సేవలు అందిస్తోంది. అలాంటి వ్యక్తుల కోసం ఓ హెల్ప్ లైన్ పనిచేస్తోంది.

ప్రస్తుతం ఉన్న ఈ స్విచువేషన్ ‌బెటర్ చేయడాని మా వంతు ప్రయత్నం చేస్తున్నాం
స్ట్రీట్ డాగ్స్, క్యాట్స్ లాంటి యానిమల్ గార్డు కూడా ఈ హెల్ప్ లైన్ పని చేస్తోంది. నేను ఇటీవల ఓ పిల్లిని రిస్క్ నుండి కాపాడాను. ఇక నుండి ఆ పిల్లి సంరక్షణ బాధ్యత నాదె!
ఈ వానా కాలంలో శుభ్రత- పరిశుభ్రత పై అవగాహన కార్యక్రమాలు చేపడుతోంది హెల్ప్ లైన్. అందులో భాగంగా ‌వీధుల క్లీన్, బ్లీచింగ్ లాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి.

కొన్నాళ్ళు పరిశ్రమ కు దూరమై యు. ఎస్ లో ఉండటం వల్ల చిత్రాలు ఓకే చేయలేదు. నేను సినీ పరిశ్రమ కు దూరమైనా నటనకు దూరం కాలేదు. సంగీత దర్శకుడు ఆర్. పి. పట్నాయక్, డాన్స్ మాస్టర్ భాను నేతృత్వంలో అనేక ప్రదర్శనలు ఇచ్చాం ముఖ్యంగా శ్రీలంకలో చేసిన షోలకు మంచి గుర్తింపు వచ్చింది. ప్రస్తుతం హిందీలో ఓ వెబ్ సీరిస్ లో చేస్తున్నా. కోవిడ్ వల్ల అది ఆలస్యం అవుతోంది. తెలుగులో రెండు , తమిళ్ లో రెండు చిత్రాలు ఫైనల్ అయ్యాయి. మళ్ళీ తెలుగు మరిన్ని చిత్రాలు చేయాలని ఉంది. తెలుగు రంగం నన్ను ఎప్పుడూ తన బిడ్డలా చూసుకుంటుంది. నటిగా తెలుగులో నే నా తొలి పరిచయం జరిగింది. అందుకే తెలుగు చిత్రాలకే నా ప్రాధాన్యత ఉంటుంది. ఓ రకంగా తెలుగు చిత్ర పరిశ్రమ నా పుట్టిల్లు లాంటిది. అందుకే మళ్ళీ ఇక్కడ కు వచ్చినందుకు ఆనందంగా ఉంటుంది” అంటు తన విశేషాలు గలగల చెప్పేసింది. ఆకట్టుకునే అందం, ఏ పాత్రనైనా నటించే సత్తా ఉన్న ఇషాచావ్లా మరోమారు తన చాటే అవకాశాలు మెండుగా ఉన్నాయని టాలీవుడ్ సినీ పండితులు చెప్పడం విశేషం!
సో…..ఇషా చావ్లా తెలుగు మరోసారి తన టాలెంట్ నిరూపించడానికి సిద్దమౌతోందన్నమాట!! Not far from the film industry but acting – Isha Chawla

Isha Chawla, a talented actress in many Telugu films, is once again busy as an actress.
Her latest Newlook photos are going viral. It is remarkable that those who have seen her after many days of gap, say that the shortage of heroines in Telugu!
If you ask her about this, she said many things. ” Auntie! Many are asking the same. Where to go! Like everyone else in this lock down period, I was stroked in Mumbai. Admission to the Ayurveda course in the meantime to increase the monotony. I have gained more prominence in yoga practice as work at work. Through yoga, many people had the opportunity to motivate themselves during this time. What I learned became useful. This is something that has given me great pleasure.
Cooking in the free time, reading books, listening to mind-blowing music seemed tempting. I woke up early in the morning, watching the sunrise and the evening sunset and seeing the beauty of nature all around us. The enjoyment of drinking a cup of tea in the evenings is not unexpected.
In addition, we have many unique needs through the Ananya Foundation, launched in 2017. In addition, the Foundation provides services to those suffering from stress and to those who may need counseling while having some thoughts. O Helpline is working for such people.

We are trying our best to make this existing switch
The helpline is also working on an animal guard like Street Dogs and Cats. I recently rescued a cat from risk. It’s my responsibility to take care of the cat!
Helpline is conducting awareness programs on cleanliness and hygiene during this rainy season. As part of this, the streets are clean and bleaching.

Some years away from the industry. Being in S did not make the pictures okay. I was distanced from the film industry, but not far from acting. Music Director R. B. Patnaik and Dance Master Bhanu have made many appearances, especially in Sri Lanka. Currently doing a web series in Hindi. Due to Covid it is being delayed. Two films in Telugu and two in Tamil became final. Again Telugu is to do more films. The Telugu sector always treats me like a child. My first introduction to Telugu was as an actress. That is why Telugu films have my preference. The Telugu film industry is kind of like my hometown. That’s why I am happy to come here again, ” he says. Tollywood film scholars say that Isha Chawla once again has a lot of chances.
So ….. Isha Chawla Telugu once again prove her talent–

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close