NEWS

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్ అభివృద్ధికి తోడ్ప‌డిన‌ ప్రతి ఒక్కరికి హృదయపూర్వక దన్యవాదాలు – నంద‌మూరి బాలకృష్ణ

బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రిసెర్చ్ ఇనిస్టిట్యూట్‌ జూన్ 22నాటికి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. దివంగత మాజీ ప్రధాని వాజ్‌పేయి చేతుల‌మీదుగా  ప్రారంభ‌మైన ఈ సంస్థ 20 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ చైర్మన్, మేనేజింగ్ ట్రస్టీ నంద‌మూరి బాలకృష్ణ ఇక్కడ సేవలందించిన వైద్యులు, సిబ్బంది, దాతలకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ గవర్నర్ తమిళి సై బసవతారకం ఆస్పత్రి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలిపారు.

నంద‌మూరి  బాలకృష్ణ మాట్లాడుతూ – “మా తండ్రి  అప్పటి సమైక్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నందమూరి తారక రామారావు గారు మా అమ్మగారు శ్రీమతి బసవతారకం గారి జ్ఞాపకార్థం క్యాన్సర్ హాస్పిటల్స్  నిర్మాణం కొరకు బసవతారక రామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ను 1988లో స్థాపించడం జరిగింది. ఇండియన్ అమెరికన్ క్యాన్సర్ ఆర్గనైజషన్( IACO) యుఎస్ఎ వారి సహకారంతో బసవతారకరామారావు మెమోరియల్ క్యాన్సర్ ఫౌండేషన్ ఇండియా 22 జూన్ 2000న బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసర్చ్ ఇన్‌స్టిట్యూట్ ను స్థాపించారు. అప్పటి ప్రధాన మంత్రి శ్రీ అటల్ బిహారి వాజపేయి గారు ఈ హాస్పిటల్ ను ప్రారంభించారు. క్యాన్సర్ వైద్యంలో ఉత్తమ ప్రమాణాలను పాటిస్తూ ఈ హాస్పిటల్ రెండు దశాబ్దాలను పూర్తి చేసుకుంది. ఈరోజు వరకు 2.5 లక్షల వరకు క్యాన్సర్ రోగులకు ఈ హాస్పిటల్ నుండి చికిత్స చేయడం జరిగింది. ఆసుపత్రి ప్రారంభ రోజుల్లో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొన్నాం. స్వర్గీయ డా. శ్రీ కోడెల శివప్రసాద్ గారు ముందు నిలిచి పరోపకారులైన డా. తులసీదేవిపోలవరపు గారు, డా. లూరిదత్తాత్రేయుడు గారు, డా. దశరధరాంరెడ్డి గారు, డా. రాఘవ రఘు పోలవరపు, కాకతీయ సిమెంట్స్ వెంకటేశ్వర్లు గారు మరెంతో మంది సహకారంతో నాన్న గారి ఆశయ  సాధన కోసం కృషి చేసి ఈ ఆసుపత్రి ని ఉత్తమమైన క్యాన్సర్ హాస్పిటల్ గా తీర్చిదిద్దారు. డా. తులసిదేవి గారు బహుకరించిన 1.83 కోట్లు ఆసుపత్రి ప్రారంభ రోజులలో ఎంతగానో ఉపయోగ పడింది. 7.5 కోట్లు సర్ దురర్జీ టాటా ట్రస్ట్ బహుకరించింది. ఈ హాస్పిటల్ లో ఒక బ్లాక్ కి ఆయన పేరు పెట్టడం జరిగింది. 100 పడకల ఆసుపత్రి గా ప్రారంభం అయ్యి నేడు 500 పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చెందింది. ఒక క‌న్వెన్‌ష‌న‌ల్ లీనియ‌ర్ యాక్సెల‌రేట‌ర్‌, రెండు ఐయ‌మ్ఆర్ టి యాక్సెల‌రేట‌ర్‌తో మొదటి దశాబ్దంలో ఈ ఆసుపత్రి  350 పడకలు కు చేరుకుంది. ఏప్రిల్ 10, 2010న ఈ ఆసుపత్రికి నేను ఛైర్మెన్ గా మేనేజింగ్ ట్రస్టీగా ఎంపికయ్యాను. 2010 సంవత్సరం తరువాత ఒక కొత్త బ్లాక్ ని నిర్మించడం జరిగింది. అందులో 9 మాడ్యులర్ ఓటీలు, రెండు ఐసియులు, రెండు హెచ్ సియు లు, మూడు లీనియర్ యాక్సలరేటర్స్ పెట్ సీటీ, ఎంఆర్ఐ లు ఉన్నాయి. ఆధునిక ప్రపంచ స్థాయి పరికరాలను ఈ హాస్పిటల్ లో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో డావెన్సి రోబోటిక‌ల్ స‌ర్జిక‌ల్ సిస్ట‌మ్‌, టోమో థెర‌పీ, హై పెక్ (hyperthermic intraperitoneal chemotherapy), 3d mammography, cyclotron, next generation sequencing, 10 colour flow cytometry, bone marrow transplantation unit ఉన్నాయి. ఆరోగ్యశ్రీ  పేద క్యాన్సర్ రోగులకు ఎయిర్ కండిషన్డ్‌ వార్డ్ లను అందుబాటులోకి తీసుకొచ్చాం. క్యాన్సర్ స్క్రీనింగ్ ప్రోగ్రాంల కొరకు ఒక  బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బస్సు లో  ఎక్స్ రే, డిజిటల్ మామోగ్రాం, అల్ట్రా సౌండ్ స్కానర్ ఉన్నాయి. డాక్టర్స్ మరియు నర్సింగ్ సిబ్బంది సహకారంతో తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలతో పాటు పొరుగు రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో తిరిగి ఇప్పటివరకు 1500 క్యాంపులలో సుమారుగా 2.50.000 మందికి  స్క్రీనింగ్ నిర్వహించాం. ఈ సమయంలోనే మన ఆసుపత్రి NABH,NABL Accreditation పొందింది. కళాజ్యోతి ప్రాసెస్ ఫౌండేషన్ బహుకరించిన రెండు కోట్ల రూపాయలతో నిర్మించిన వసతి గృహ( డామెట్రి) భవనాన్ని ఏప్రిల్ 9 , 2017లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఈ వసతి గృహం లో250 మంది రోగులకు ఉచితంగా లేదా 12 రూపాయల లోపు తక్కువ ఖర్చుతో వసతి కల్పించడం జరుగుతుంది. సెమెంట్రెన్ ఫౌండేషన్ యూ ఎస్ ఎ వారి సహకారంతో 3000 మందికి క్రెఫ్ట్ లిప్‌ సర్జరీస్ ను ఉచితంగా చేయడం జరిగింది. ఈ హాస్పిటల్ నిపుణులైన  surgical oncologist, మెడికల్oncologist లు, రేడియేషన్ oncologist లు డాక్టర్స్, నర్సులు పారామెడికల్ మరియు ఇతరులు 1500 మందికి పైగా ఉపాధి కల్పించింది  ఆసుపత్రి అభివృద్ధిలో భాగ‌స్వాములు అయినా CEO, MD, COO మరియు ఇతర సిబ్బందిని నేను ప్రశంసిస్తున్నాను. ఈరోజు వరకు వారు పేద క్యాన్సర్ రోగుల చికిత్స కొరకు చాలా కష్టపడ్డారు. ఆసుపత్రి ఆశయ సాధనలో వారి అంకితభావం ఊహాతీతమైనది.  20 సంవత్సరాల్లో ఆసుపత్రి అభివృద్ధి వెనక ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా నా హృదయపూర్వక దన్యవాదాలు. ఏ ఆసుపత్రి అభివృద్దికైనా డాక్టర్స్ చాలా ముఖ్యమైనవారు. డా.టి. సుబ్రహ్మణ్యేశ్వర రావు, డా. కె వి.వి . ఎల్  రాజు, డా. చంతిల్ జె. రాజప్ప, డా. ఎ.కె రాజు గార్ల లాంటి అంకితభావంతో పనిచేసే దయగల నిపుణులైన డాక్టర్స్ ఉండడం మన అదృష్టం. వారి సేవల వల్లనే ఈ ఆసుపత్రి ఉత్తమ క్యాన్సర్ హాస్పిటల్స్ లో ఒకటిగా నిలవగలిగింది.  ఈ పది సంవత్సరాల్లో మనకు The Hansa Research Survey 2019 యొక్క ఏడవ జాతీయ ర్యాంక్ అవార్డు లభించడం జరిగింది. పేద, మధ్య తరగతి క్యాన్సర్ రోగులకు తక్కువ ధరకే ఉత్తమ చికిత్సను మన హాస్పిటల్ అందిస్తుంది. డాక్టర్స్ కృషి వల్ల ఈ హాస్పిటల్ ఇంకా ఉన్నత శిఖరాలకు చేరుకుంటుంది అని ఆశిస్తున్నాను. ప్రస్తుత కోవిడ్ – 19 మహమ్మారి ప్ర‌బ‌లిన‌ పరిస్థితులలో వ్యాది వ్యాప్తి చెందకుండా ఆసుపత్రి ఎన్నో జాగ్రత్త చర్యలను చేపట్టింది. రోగులకు వారి సహాయకుల ముందు జాగ్రత్త కొరకు తగిన సమాచారాన్ని అందిస్తున్నాం. ప్రతిరోజు 1000 మంది రోగులు వారి సహాయకులు వచ్చే ఈ హాస్పిటల్ లో కోవిడ్ -19 వ్యాప్తి చెందకుండా చూడడం యాజమాన్యానికి ఒక సవాల్ లాంటిది. ఈ ప్రయత్నానికి నేను అభినందిస్తున్నాను. మన క్యాంపస్ లో స్నేహభావాన్ని కలిగిస్తూ క్యాన్సర్ రోగుల చికిత్సలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ 24 గంటలు అంకిత భావంతో పనిచేసే సిబ్బంది ఉండడం నాకు చాలా గర్వకారణం.  అది నా పూర్వ జన్మ సుకృతంగా భావిస్తున్నాను. మన వ్యవస్థాపకులకు, గౌరవనీయులైన మాజీ బోర్డు సబ్యులకు, బోర్డు సబ్యులకు, డాక్టర్స్ కు, నర్స్ లకు, పారామెడికల్, నాన్ మెడికల్ సిబ్బందికి , శ్రేయోభిలాషులకు మరియు ఆసుపత్రి అభివృద్ధిలో పాల్గొన్న దాతృత్వపు సంస్థలకు, వ్యక్తులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు“ అన్నారు.BALAKRISHNA VIDEO   Download link
https://wetransfer.com/downloads/dd6ab64cb12cfbcf97a62abdececf6dd20200622113739/710cfcf94ab0d0e71b898fad7ed2013e20200622113806/8a8723

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close