Gossips

పెంచిన కరెంట్ రేట్లు కు నిరసనగా గుండ లక్ష్మీదేవిగారి ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం

కరోనావైరస్ వ్యాప్తి తో ప్రజానీకం ఒ పక్క బాధలు పడుతుంటే మన రాష్ట్రము లో ఇపుడు కరెంట్ బిల్లులు పెంపు పేద మధ్య తరగతి ప్రజానీకాన్ని ఇంకా ఎక్కువ భయ పెడుతున్నాయని వెంటనే పెరిగిన రేట్లు తగ్గించాలని , 3 నెలల కరెంట్ బిల్లులు రద్దు చేయాలనీ మాజీ MLA గుండ లక్ష్మీదేవి గారు ప్రభుత్వాన్ని కోరారు , ఈ రోజు (21/05/20) జాతీయ టీడీపీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశానుసారం పెంచిన కరెంట్ రేట్లు కు నిరసనగా స్థానిక 7 రోడ్స్ Jn, లో అన్న ఎన్టీఆర్ గారి విగ్రహం దరి శ్రీకాకుళం నియోజకవర్గం టీడీపీ ఇంచార్జి మాజీ శాసనసభ్యురాలు అమ్మ గుండ లక్ష్మీదేవిగారి ఆధ్వర్యం లో నిరసన కార్యక్రమం జరిగింది అనంతరం లక్ష్మీదేవి గారు మాట్లాడుతూ ఒ పక్క కరోనా వైరస్ వ్యాప్తి తో ప్రజలు బయ పడుతుంటే ఈ సమయం లో కరెంట్ రేట్లుపెంచడం ఏంటని, వైసీపీ ఎన్నికల హామీలలో తమ ప్రభుత్వం లో కరెంట్ రేట్లు పెంచమని చెప్పారని ,దానికి విరుద్దుంగా పిడుగుల్లాంటి కరెంట్ బిల్లుల బాదుడు ఏంటని సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు ఫిబ్రవరి నెలలో,1000/వస్తే ఇపుడు రెండు నెలలకు 10,000 రావడం జరిగిందని ఆలా వచ్చిన బిల్లులు చూపిస్తూ చెప్పారు ,చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న 2014 నుండి 5 సంవత్సరాల కాలం లో ఎపుడు కరెంట్ చార్జీలు పెంచలేదని,ఆమె అన్నారు,కావునా పెరిగిన కరెంట్ బిల్లులతోప్రజానీకం బాధలు పడుచున్నారని , వారి బాధలు అర్ధం చేసుకొని తక్షణం వాటిని తగ్గించి , 3 నెలలబిల్లులు రద్దు చేయాలనీ ప్రభుత్వాన్ని కోరారు నగరటీడీపీ అధ్యక్షులు మాదారపు వెంకటేష్ మాట్లాడుతూ కరోనా వైరస్ కంటే ఎక్కువ గా పెరిగిన కరెంట్ బిల్లులు పేద, మధ్యతరగతి వర్గ ప్రజానీకాన్ని భయపెడుతున్నాయని కావునా అందుకు కారణమైన కొత్త టారిఫ్ గ్రూపులు ప్రస్తుతానికి రద్దు చేసి 2020 మార్చి నెల ముందు నుండి ఉన్న గ్రూప్ లను అమలు చేయాలని రెండు నెలలకు వేరు వేరుగాకరెంట్ బిల్లుల తీస్తే స్లాబ్స్ తక్కువపడి బిల్లులు తక్కువ వస్తాయని నూతన స్లాబ్స్ వలన బిల్లులు ఎక్కువ అమౌంట్ వచ్చి ప్రజలను కరెంట్ బిల్లుల షాకులు నుండి కాపాడాలని, ముందు పేద, మధ్యతరగతి వారి సౌలభ్యం కోసం కనీసం 3 నెలల కరెంట్ బిల్లులు మాఫీ చేయాలనీ కోరారు, కరోనా (కోవిడ్-19) వైరస్ వలన ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ మూలంగా పేద,మధ్య తర్కగ ప్రజలు ఆదాయం రాక తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతూ వారి కుటుంబాలు పోషణకే చాలా బాధలు పడుతున్నారని అదే కాకుండా ఈ మధ్యకాలంలో మరి కొన్ని వస్తువులు కూడా విపరీతంగా ధరలు పెరగా వారి ఆర్థిక బాధలుకు కారణం అని ఇటువంటి క్లిష్ట సమయంలో “గోరుచుట్టు పై రోకటి పోటువలే ఇపుడు విద్యుత్ స్లాబ్ లు మార్పు వలన ప్రజలకు వోల్టేజ్ కరెంట్ షాక్స్” కొడుతు న్నాయని వ్యాపార వర్గాల వారికి కూడా ఏప్రిల్ నుండి మారిన కొత్త స్లాబ్స్ వలన తీవ్ర ఇబ్బందులు పడతారని కావునా గత మార్చి నెల వరకు ఉన్న గ్రూప్ లనే కొంతకాలం కొనసాగించాలని అలాగే ఇంతకు ముందు 300 యూనిట్స్ వరకు B గ్రూప్ ఉం￰డేదని అది తగ్గించి 225 చేసారని ఇపుడు 225 దాటితే C గ్రూప్ కొత్తగా ప్రభుత్వం మార్చడం వలన 225 యూనిట్స్ దాటిన వార్కి యూనిట్ ధరలు మూడొంతులు పెరగడంతో అధికంగా కరెంట్ బిల్లులు వస్తున్నాయని కావునా ప్రజా సంక్షేమందృష్ట్యా పాత టారిఫ్ ప్రస్తుతానికి ఉంచాలని , 3 నెలల బిల్లుల రద్దుచేసి ప్రజలకు ప్రభుత్వం అండగా నిలవాలని వెంకటేష్ విజ్ఞప్తి చేసారు , ఇంకా ఈ కార్యక్రమం లో నగర టీడీపీ ప్రధాన కార్యదర్శి చిట్టినాగభూషణంసింతు సుధాకర్, జామి భీమశంకర్, పాండ్రంకి శంకర్, శిల్లా శ్రీనువాసరావు , కవ్వాడి సుశీల, కోరాడ హరగోపాల్, ప్రధాన, విజయరాం ,మాజీ కౌన్సిలర్లు గంగునాగేశ్వరావు కేశవ రాంబాబు ,PMJ బాబు,సురకాశి వెంకటరావు ,కరగాన రాము గండేపల్లి కోటేశ్వరావు ,పట్నాల పార్వతీశం , తాళ్లూరి నవీన్, కోళ్ళ శ్రీనివాస దేవ్ రోణంకి కళ్యాణ్,గుమ్మా రఘురాం ,, P.సతీష్ బాబా ,B.నాగేంద్రయాదవ్ సింహాద్రినాయుడు ,బలగ ప్రసాద్ దేవ్ , జాక శ్యాం ,సిరిపురం హరి , విభూది సూరిబాబు ,అసిరమ్మ, వివిధ డివిజన్ ల టీడీపీ ఇన్చార్జిస్ , యువత, పార్టీ క్యాడర్ పాలుగున్నారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close