
NEWS
పేదలకు తెలుగు తమ్ముళ్ల చేయూత
కరోనా మహమ్మారి కారణంగా ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. ఇలాంటి సందర్భంలో అనంతపురంలోని తెలుగు తమ్ముళ్లు లాక్ డౌన్ కారణంగా ఇబ్బంది పడుతున్న వారికి సహాయం చేశారు.
అనంతపురంలోని సాయిబాబా నగర్ లో నివాసం ఉంటున్న 200 పేదలకు తెలుగు తమ్ముళ్లు జిల్లా గ్రంధాలయ సంస్థ మాజీ ఛైర్మెన్ గౌస్ మోద్దీన్ చేతులమీదుగా నిత్యవసర సరుకులు అందజేశారు. టిడిపి నాయకులు డిష్ ప్రకాష్, హరీష్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




