NEWS
Trending

కరోనా క్రైసిస్ నేపథ్యంలో వైరల్ అయిన ఫేక్ వీడియోలు.

కరోనా క్రైసిస్ నేపథ్యంలో ఓ 5 ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. వాటిలోని నిజానిజాలు ఇవి.

వీడియో 1: ‘ఓ పది మంది కలిసి ఖాళీ ప్లేట్లను, స్పూన్లను నాకుతూ దేశంలో కరోనా వ్యాపింపజేస్తున్నారు’ అని ఒక వీడియోకు వ్యాఖ్యానం జోడించి ప్రచారం చేస్తున్నారు.

నిజం: ఇది 2018 సంవత్సరపు వీడియో. ట్విట్టర్ లో వుంది. షియాముస్లిం మతంలోని ఒక సంప్రదాయంలో భాగంగా, ‘దేవుడిచ్చిన ఒక్క మెతుకును కూడా వృధా చేయకూడదు’ అనే భావనలో వారి సమిష్టి భోజనంలో ప్లేట్లు, స్పూన్ లను క్లీన్ గా నాకుతున్న వీడియో ఇది.

వీడియో 2: రోడ్డు మీద తోపుడు బండి మీద ఒక ముస్లిం వృద్ధుడు ఆరెంజ్ పండ్లను అమ్ముకుంటూ, ఆరెంజ్ పండ్లను తన చేతి వేళ్ళతో కౌంట్ చేస్తున్నాడు. అతను ఇలా కరోనాను వ్యాప్తి చేస్తున్నాడు అని వ్యాఖ్యానిస్తూ వీడియోను ప్రచారం చేస్తున్నారు.

నిజం: ఆ వీడియో కరోనా వ్యాప్తి చెందని కాలం నాటిది. ఇది మధ్యప్రదేశ్ పోలీసులకు కూడా తెలిసిన విషయం . అతని మానసిక అనారోగ్యం వల్ల డబ్బులు కౌంట్ చేస్తున్నట్లుగా చేస్తుంటాడు. లాజిక్ ఏంటంటే, వీడియోలో మాస్కులు ఏ ఒక్కరికీ లేవు. జన సమూహం ఉంది. ముఖ్యంగా కార్లు, ఆటోలు నడుస్తున్నాయి. సాధారణ రోజులలాగా వరుసగా దుఖానాలు తెరిచి వున్నాయి. ఇది క్లియర్ గా పాత వీడియో అని చూస్తేనే తెలుస్తుంది. కానీ ఈ వృద్ధుడు తన వేళ్ళతో కరోనాను వ్యాపింప చేస్తున్నాడు అని, చిన్న చిన్న బిజినెస్ లు చేసుకునే వాళ్ళ మీద నెగెటివ్ ప్రచారానికి పూనుకుంటున్నారు.

వీడియో 3: పోలీసులు ఓ ఖైదీని పోలీసు వ్యానులో తీసుకెళ్తుంటారు. ఓ కానిస్టేబుల్ కు అతనికి మధ్య ఏం జరిగిందో, ఆ ఖైదీ పోలీసు మీద ఉమ్మెస్తాడు. ముస్లింలు ఈ విధంగా కరోనా వ్యాపింపజేస్తున్నారు అనే అర్థంలో వ్యాఖ్యానిస్తూ ప్రచారం చేస్తున్నారు.
నిజం: ఆ వీడియో పాతది. కరోనా ఆంక్షలు లేని కాలంలోనిది. బొంబాయి లోని ఓ ఖైదీ వీడియో. అది “టైమ్స్ ఆఫ్ ఇండియా” వాళ్ళు పబ్లిష్ చేసిన వీడియో. పోలీసుల మీద కరోనాను ఇలా వ్యాపిస్తున్నారు అని వ్యాఖ్యానాన్ని జోడిస్తూ ప్రచారం చేస్తున్నారు.


వీడియో 4: ఒక వీడియోలో వారి ప్రార్థనలలో సమిష్టిగా, బలంగా శ్వాసను తుమ్ములా వదిలె వీడియోని తీసుకుని కరోనాకు లింక్ ఇస్తున్న వ్యాఖ్యానంతో ప్రచారం చేస్తున్నారు.

నిజం: ఇది పాకిస్తాన్ కు సంబంధించిన పాత వీడియో. అలా శ్వాస వదులుతూ, తల ఊపడం అనేది వారి సంప్రదాయంలో భాగంగా సూఫీ లోని జికర్ అనే ఆచారం. ఇది “ఇండియా టుడే” లో కూడా పబ్లిష్ అయింది.

వీడియో 5: ముస్లిం లాగా వున్న ఒకతను పాప్ కార్న్ లాంటి ఫుడ్ ప్యాకెట్ లో, నోటితో గాలి ఊదుతూ ఉంటాడు. దీన్ని కూడా కరోనా వ్యాపిస్తున్న ముస్లిములు అనే వ్యాఖ్యానంతో ప్రచారం చేస్తున్నారు.
నిజం: మలేషియా దేశంలో 2019 మే 1న రిలీజ్ అయిన వీడియో. నెట్ లో అప్పటినుండి వుంది.

పైన చెప్పిన వీడియోలు అన్ని పాతవే. కరోనా వ్యాప్తికి వాటికి సంబంధం లేదు. ఈ వీడియోలలో పరిశుభ్రత విషయం ప్రస్తుతానికి పక్కన పెడితే, ఈ సమయంలో ఇలాంటి వీడియోలు మతాల మధ్య, మనుషుల మధ్య విద్వేషాలు నింపుతున్నాయి. ఇంకా ఇలాంటివి ఇంకొన్ని వీడియోలు సర్క్యులేటు అవుతున్నాయి. వెంటవెంటనే ఇవి ఫేక్ వీడియోలు అని చెప్పండి. ఈ కష్ట కాలంలో మనం నమ్మకాన్ని, పరస్పర విశ్వాశాన్ని పోగొట్టుకోవద్దు. సత్యం కోసం, కరోనా నిర్ములన కోసం ఓపిక పడదాం.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close