NEWS

రక్తనిల్వలు లేవు , దాతలు ముందుకు రండి

రక్తనిల్వలు లేవు , దాతలు ముందుకు రండి ……కరోనా వైరస్ ( కోవిడ్-19) మహమ్మారివలన శ్రీకాకుళం నగరం లో గల జిల్లా రెడ్ క్రాస్ లో తగినంత రక్త నిల్వలు లేవని,అవి పూర్తి గా నిండుకున్నాయని ఆ విషయం తెల్సుకొని తారకరామా & మోక్షజ్ఞ సేవా సంఘం స భ్యులు ఈ రో జు (02/04/20) రెడ్ క్రాస్ లో గల బ్లడ్ బ్యాంక్ లో రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ,

ఈసందర్భగా మాదారపు డేవిడ్ మాట్లాడుతూ లాక్ డౌన్ పరిస్థితి వలన బ్లడ్ బ్యాంక్ లో పూర్తిగా రక్తనిధులు లోటు ఏర్పడిందని , ఈ పరిస్థితి వలన అత్యవసర రోగులకు , మరియు గర్భిణీలకు, ఇతర వ్యాధి బాధితులకు , రక్తహీనతతో బాధపడుతోన్న వారికీ రక్తం అందక చాల ఇబ్బందులు పడుతున్నారని కావున ఈ సమయం లో వీలున్నంత మేరకు రక్తదాతలు ముందుకు రావాలని , ముఖ్యం గా యువత, స్వచ్చంద సేవ సంస్థలు చొరవతీసుకుని ఆపదలో రక్తం దొరకక ఇబ్బందులు పడుతున్న వారిని ఆదుకోవాలని అన్నారు, అయితే లాక్ డౌన్ సందర్భం గా ఈ శిబిరాలు నిర్వహించడం కుదరదు కావున దాతలు ఇంటికి కూడా రెడ్ క్రాస్ రక్తసేకరణ వాహనం పంపుతారని లేదా జిల్లావైద్య ఆరోగ్య శాఖా కార్యాలయంపక్కన గల రెడ్ క్రాస్ రక్తనిధి కార్యాలయానికి వచ్చి చేయవచ్చని డేవిడ్ అన్నారు

ఈ రక్తదానం చేసినవారు బి .ప్రదీప్, రాజశేఖర్ , సాయికృష్ణ , రాజు , శ్రీచరణ్ , సంపత్ ,విజయ్,శ్రీరామ్ ఉన్నారు అలాగే 2 వ రోజు నగరం లో గల 37 సచివాలయ పరిధిలో ANM మరియు ఆశా వర్కర్స్ కు మజ్జిగ, లస్సి, పాకెట్స్ మరియు హైవే పై భోజనాలు లేక ఇబ్బందులు పడుతున్న వలస దారులకు , యాజకులకు భోజనం పాకెట్స్ కూడా తారకరామా, మోక్షజ్ఞ సేవా సంఘ సభ్యులు , పవన్, నీలు, దేవా, సురేంద్ర, ప్రసన్న ,పృద్వీ , సతీష్ , రాజశేఖర్ పాలుగొని అందించారు

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Close
Close