
శుభపరిణామం…..చికిత్స పొందుతున్న 11మంది పాజిటివ్ పేషెంట్ లకు నెగిటివ్ వచ్చింది..వాళ్ళు రేపు డిశ్చార్జ్ అవుతారు
ప్రజలందరు ఇదే నియంత్రణను పాటించాలి…ఈ గండం నుండి బయట పడే వరకు ప్రజలు సహకరించాలి..దేశంలోని లాక్ డౌన్ ను ఇతర దేశాలు ప్రశంసిస్తున్నాయి…ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా మరి కొంతకాలం లాక్ డౌన్ పాటించాలి..
దక్షిణ కొరియాలో ఒక్కవ్యక్తి ద్వారా 50వేల మందికి వ్యాపించింది.. జాగ్రత్తగా ఉండాలి.. సీరియస్ గానే తీసుకోవాలి..క్వారెంటైన్ లో ఉన్నవారు 25,937 మంది ఉన్నారు..ఏప్రిల్ 7వ తేదీ నాటికి వీరందరి క్వారెంటన్ పూర్తి అవుతుంది…కొత్తకేసులు రాకుంటే 7వతేదీతో ఈసమస్య తీరిపోతుంది..తీరిపోవాలని ప్రార్దిస్తున్నా
- ముఖ్యమంత్రి #కేసీఆర్
★ఈ సారి అధికారులు ధాన్యం మొత్తం గ్రామలలోనే కొంటారు…కూపన్ వైస్ కొంటారు…రైతులు మార్కెట్ లకు రావాల్సిన అవసరం లేదు…ఒక్కో గ్రామానికి ఒక్కో తేదీలో కొంటాం…రైతు పంటను పూర్తిగా ప్రభుత్వమే కొంటది
★డబ్బులు రైతుల అకౌంట్లలోకి ఆన్లైన్ ద్వారా చెల్లిస్తాం…ఒక్క గింజ వదలకుండా పంట కొనుగోలు చేస్తాం
★పంట అమ్మే సమయంలో రైతులు నియంత్రణ పాటించాలి..
★రైతులు గ్రామాల శ్రేయస్సు కోసమే ఈ నిర్ణయం తీసుకున్నాం
★చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పంటలు బాగా పండినయి..పంట కొనడానికి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా ఫుడ్ కార్పొరేషన్ కు డబ్బులు కేటాయించి పంట కొనుగులు నిర్ణయం తీసుకున్నాం
