
తెలంగాణలో లాక్డౌన్కు ప్రజలు సహకరించాలని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. కరోనా వైరస్ను ఎదుర్కొనేందుకు అందరూ సమాయత్తం కావాలని మంత్రి పిలుపు ఇచ్చారు. నర్సింగ్, మెడికల్ విద్యార్థుల సేవలు తీసుకుంటామన్నారు. ఎయిమ్స్, ఈఎస్ఐ ఆస్పత్రుల్లోనూ ఏర్పాట్లు చేశామని మంత్రి ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.
