
ఈనెల 31వరకు లాక్డౌన్ ,బయటికి రాకండి! : కేసీఆర్
ప్రభుత్వ ఉద్యోగులు కార్యాలయాలకు రానవడం లేదు. అత్యవసర సర్వీసులకు మాత్రం హాజరుకావాలి. మార్చి 31 వరకు అన్ని కార్యక్రమాలు బంద్. వారం రోజులకు కార్మికులకు యజమాని వేతనాలు చెల్లించాల్సిందే. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల లిస్ట్ రెడీ చేస్తున్నాం. ప్రజలెవ్వరూ ఇళ్లు దాటి బయటికెళ్లొద్దు’ అని కేసీఆర్ సూచించారు
కరోనా మహమ్మారిని అడ్డుకునేందుకు మార్చి 31 వరకు రాష్ట్రాన్ని లాక్డౌన్ చేస్తున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కాగా, లాక్డౌన్లో ప్రజలు ఇబ్బందులు పడకుండా నిత్యవసర సరుకులు అందజేస్తామని ఆయన ప్రకటించారు. అయితే నిత్యావసరాల తీసుకోవడానికి కుటుంబంలో ఒక్కరికే అనుమతి ఇస్తామని, గుంపులుగా జమ కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని అన్నారు. స్వీయ నియంత్రణ ప్రకటిస్తేనే కరోనాను ఎదుర్కోగలమని కేసీఆర్ అన్నారు.
”వారం రోజులకు కార్మికులకు యజమాని వేతనాలు చెల్లించాల్సిందే. ప్రసవానికి సిద్ధంగా ఉన్న గర్భిణుల లిస్ట్ రెడీ చేస్తున్నాం. అత్యవసర ఆరోగ్య సేవల్ని కొనసాగిస్తాం.
నిరుపేదల(27.82లక్షల కుటుంబాల)కు నెల మొత్తానికి సరిపడా రేషన్ బియ్యం పంపిణీ.
తెల్ల రేషన్ కార్డున్న వారిలో ఒక్కోక్కరికి 12కేజీలు
రేషన్ కార్డున్నవారికి రూ.1500ఇస్తాం..
ఉద్యోగులు 80%మంది రావాల్సినవసరంలేదు..
కానీ మిగిలిన 20% మంది రోటేషన్ పద్ధతిలో రావాలి..
అత్యవసర ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం అందరూ రావాలి.
ప్రభుత్వ ఉద్యోగుల విధుల్లో త్వరలోనే క్లారిటీస్తాం..
ఎవరు ఇల్లు దాటి బయటకు రావద్దు..
అత్యవసర పరిస్థితుల్లో కుటుంబంలో ఒక్కరికి మాత్రమే అవకాశం..
ఎలాంటి పరిస్థితుల్లో ఐదుగురికి మించి గుమిగూడదు..
1897చట్టం ప్రకారం ఔట్ సోర్సింగ్,ప్రయివేట్ ఉద్యోగులకు ఈ వారం రోజుల జీతం చెల్లించాలి..
వైద్యసేవల్లో అత్యవసర సేవలు తప్పా అన్ని రద్దు..
అన్ని రకాల రవాణా సర్వీసులన్నీ రోడ్లపైకి రావద్దు..
Hon’ble CM KCR Garu announced Telangana Lockdown till 31st March. 2.83 Cr people (87.59 lakh white cards) will receive free ration & financial assistance of ₹1500. Total ₹2,417 Crores to be borne by Govt !! #CoronaVirus #StaySafe #SocialDistanacing