MOVIE NEWS

కార్తి 25, రాజు మురుగన్, డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘జపాన్’ దీపావళికి రిలీజ్, ఇంట్రో గ్లింప్స్ విడుదల

Actor Karthi's 25th film 'Japan' directed by Raju Murugan and Produced by Dream Warrior Pictures Releasing For Diwali, Intro Glimpse Out Now

Japan

వరుస హిట్లతో దూసుకుపోతున్న హీరో కార్తీ ప్రస్తుతం జోకర్ ఫేమ్ రాజు మురుగన్ దర్శకత్వంలో అవుట్ అండ్ అవుట్ అడ్వెంచరస్ థ్రిల్లర్ జపాన్ చేస్తున్నారు. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంపై ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం కార్తీ 25వ చిత్రం.

కార్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ సినిమాలోని అతని పాత్ర ఇంట్రో గ్లింప్స్ ని విడుదల చేశారు. కార్తీని జపాన్‌గా పరిచయమయ్యారు. ఇందులో ఓ పెక్యులర్ పాత్రలో నటిస్తున్నారు. అతని గురించి వేర్వేరు వ్యక్తులకు విభిన్న అభిప్రాయాలను వుంటాయి. ముగ్గురు డిఫరెంట్ వ్యక్తులకు అతను హీరో, కమెడియన్, విలన్.

కార్తీ గ్లింప్స్‌లో గిరజాల జుట్టుతో డిఫరెంట్ లుక్‌లో హిలేరియస్ గా కనిపించారు.  గ్లింప్స్  భోరసా ఇస్తున్నట్లు జపాన్ అడ్వంచర్ రైడ్‌ను అందించబోతోంది. మేకర్స్ అనౌన్స్ చేసినట్లుగా జపాన్ ఈ సంవత్సరం దీపావళికి  విడుదల కానుంది

తొలిసారిగా కార్తీ సరసన అను ఇమ్మాన్యుయేల్‌ నటిస్తోంది. సునీల్ కీలక పాత్రలో కనిపించనున్న ఈ చిత్రంలో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ విజయ్ మిల్టన్ తొలిసారిగా నటిస్తున్నారు.

జివి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఫిలోమిన్ రాజ్ ఎడిటర్.. నేషనల్ అవార్డ్ విన్నింగ్ ప్రొడక్షన్ డిజైనర్ (కమ్మరసంభవం) వినేష్ బంగ్లాన్ జపాన్ ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్నారు.

రాజుమురుగన్ – కార్తీ – డ్రీమ్ వారియర్ పిక్చర్స్ త్రయం ఇప్పటికే అంచనాలను పెంచడంతో ప్రేక్షకులలో తగినంత బజ్ క్రియేట్ చేశాయి. గ్లింప్స్ క్యురియాసిటీని పెంచింది.

తారాగణం: కార్తి, అను ఇమ్మాన్యుయేల్‌, సునీల్, విజయ్ మిల్టన్
సాంకేతిక విభాగం:
దర్శకత్వం:   రాజు మురుగన్
నిర్మాతలు:  ఎస్‌ఆర్‌ ప్రకాష్‌బాబు, ఎస్‌ఆర్‌ ప్రభు
బ్యానర్:  డ్రీమ్ వారియర్ పిక్చర్స్
సంగీతం:  జివి ప్రకాష్ కుమార్
ఎడిటర్: ఫిలోమిన్ రాజ్
ప్రొడక్షన్ డిజైనర్: వినేష్ బంగ్లాన్
పీఆర్వో: వంశీ శేఖర్

Tags

Related Articles

Back to top button
Close
Close