MOVIE NEWS

సాయిరాం శంకర్- ప్రకాష్ జూరెడ్డి, మాస్ట్రో ఇళయరాజా, విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 గ్రాండ్ గా ప్రారంభం

Sairam Shankar- Prakash Jureddy, Maestro Ilayaraja, VNR Creations Production No.1 Grand Opening

ఎనర్జిటిక్ హీరో సాయిరాం శంకర్ కథానాయకుడిగా విఎన్ఆర్ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెంబర్.1 లాంఛనంగా ప్రారంభమైయింది. పోలవరం బంగారమ్మ అమ్మవారి గుడిలో చిత్ర పూజా కార్యక్రమాలు గ్రాండ్ గా జరిగాయి. ప్రకాష్ జూరెడ్డి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. 90‘s లో జరిగిన యదార్ధ సంఘటన ఆధారంగా విలేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని రమణి జూరెడ్డి నిర్మిస్తున్నారు.

ముహూర్తం సన్నివేశంలో ” గంగ తలపై ఉన్నంత వరకే శివుడు చల్లగా ఉంటాడు. కంట్లోంచి గానీ జారిందా శివమెత్తుతాడు”అని సాయిరాం శంకర్ చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ ఆకట్టుకుంది.  

మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం అందించడం మేజర్ హైలెట్. అఫీషియల్ గా హైదరాబాద్ లో గ్రాండ్ గా ఓపెనింగ్ నిర్వహించి ఈ చిత్రానికి సంబధించిన మిగతా వివరాలు వెల్లడిస్తామని మేకర్స్ తెలియజేశారు.

మధుర వైన్స్, జైత్ర వంటి సినిమాలు పని చేసిన మోహన్ చారి ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ చిత్రానికి పెద్ద వంశీ (డైరెక్టర్) లిరిక్స్ అందించడం మరో విశేషం. అలాగే పుష్ప వంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కి పని చేసిన కార్తీక్ శ్రీనివాస్ ఈ చిత్రానికి ఎడిటర్.

తారాగణం: సాయిరాం శంకర్

టెక్నికల్ టీం:
దర్శకత్వం: ప్రకాష్ జూరెడ్డి  
నిర్మాత:  రమణి జూరెడ్డి
బ్యానర్: విఎన్ఆర్ క్రియేషన్స్
సంగీతం: మాస్ట్రో ఇళయరాజా
డీవోపీ:  మోహన్ చారి
ఎడిటర్:  కార్తీక్ శ్రీనివాస్
లిరిక్స్: పెద్ద వంశీ (డైరెక్టర్), రెహమాన్
పీఆర్వో: వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close