MOVIE NEWS

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని, శ్రీనివాస చిట్టూరి, శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ #BoyapatiRAPO ఫస్ట్ థండర్ మే 15న విడుదల

Blockbuster Maker Boyapati Sreenu, Ustaad Ram Pothineni, Srinivasaa Chitturi, Srinivasaa Silver Screen’s #BoyapatiRAPO First Thunder On May 15th

BoyapatiRAPO

బ్లాక్ బస్టర్ మేకర్ బోయపాటి శ్రీను, ఉస్తాద్ రామ్ పోతినేని క్రేజీ ప్రాజెక్ట్ #BoyapatiRAPO ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. అన్ని కమర్షియల్ అంశాలతో కూడిన యాక్షన్, మాస్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై భారీ నిర్మాణ విలువలు, అత్యన్నత సాంకేతిక ప్రమాణాలతో, హ్యుజ్ బడ్జెట్‌తో శ్రీనివాస చిట్టూరి ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని జీ స్టూడియోస్, పవన్ కుమార్ సమర్పిస్తున్నారు.

 ఈ చిత్రం ఫస్ట్ థండర్ ను రామ్ పుట్టినరోజు అయిన మే 15 న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. మే 15 ఉదయం 11:25 గం. ముహూర్తంగా ఖరారు చేశారు. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో రామ్ డాషింగ్, డైనమిక్‌గా కనిపిస్తున్నారు. స్టైలిష్ హెయిర్‌డో, మందపాటి గడ్డం రగ్గడ్ నెస్ ని తీసుకొచ్చింది. డెనిమ్ షర్ట్, జీన్స్ ధరించి రామ్ తన చేతిలో బేస్ బాల్ బ్యాట్‌తో ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. బ్యాగ్రౌండ్ లో పెద్ద ఎద్దును కూడా చూడవచ్చు. ఈ సినిమాలో మాసీవ్ క్యారెక్టర్‌లో నటించేందుకు రామ్ బీస్ట్ లుక్‌లో కనిపించారు.  

హ్యాపనింగ్ హీరోయిన్ శ్రీలీల ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో రామ్ కు జోడిగా నటిస్తోంది. ఇందులో ప్రముఖ పాత్రలలో కొంతమంది ప్రముఖ నటులు నటిస్తున్నారు.

ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఎడిటింగ్‌ను తమ్మురాజు నిర్వహిస్తుండగా, సంతోష్ డిటాకే సినిమాటోగ్రఫీ ఆదిస్తున్నారు.  

#BoyapatiRAPO దసరా కానుకగా  అక్టోబర్ 20న హిందీ, అన్ని దక్షిణ భారత భాషల్లో విడుదల కానుంది.

తారాగణం: రామ్ పోతినేని, శ్రీలీల

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: బోయపాటి శ్రీను
నిర్మాత: శ్రీనివాస చిట్టూరి
బ్యానర్: శ్రీనివాస సిల్వర్ స్క్రీన్
ప్రెజెంట్స్: జీ స్టూడియోస్, పవన్ కుమార్
సంగీతం: ఎస్ థమన్
డీవోపీ: సంతోష్ డిటాకే
ఎడిటింగ్: తమ్మిరాజు
పీఆర్వో: వంశీ-శేఖర్, పులగం చిన్నారాయణ
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close