MOVIE NEWS

మంత్రి మల్లారెడ్డి అనౌన్స్ చేసిన విజె సన్నీ, సప్తగిరి, డైమండ్ రత్నబాబు, రజిత్ రావు ‘అన్ స్టాపబుల్’ రిలీజ్ డేట్ – జూన్ 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల  

Minister Mallareddy Announces VJ Sunny, Saptagiri, Diamond Ratnababu, Rajit Rao 'Unstoppable' Release Date - 9th June Worldwide Release

పిల్లా నువ్వు లేని జీవితం, ఈడోరకం, ఆడోరకం వంటి హాస్య ప్రధాన చిత్రాలతో రచయితగా తనదైన ముద్ర వేసుకున్న డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో రూపొందుతున్న హిలేరియస్ ఎంటర్ టైనర్ ‘అన్ స్టాపబుల్’.  ‘అన్ లిమిటెడ్ ఫన్’ అన్నది ఉపశీర్షిక.  బిగ్ బాస్ విన్నర్ విజె సన్నీ, సప్తగిరి హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో నక్షత్ర, అక్సాఖాన్ హీరోయిన్లు. ఎ2 బి ఇండియా ప్రొడక్షన్ లో రజిత్ రావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘అన్ స్టాపబుల్’ టీజర్‌ , పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా అన్ స్టాపబుల్  థియేట్రికల్ రిలీజ్ డేట్ ఖరారైంది. మంత్రి మల్లారెడ్డి ఈ చిత్రం విడుదల తేదీని అనౌన్స్ చేశారు. జూన్ 9న  ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం విడుదల కానుంది. సప్తగిరి, విజే సన్నీ తో పాటు సినిమా తారాగణం అంతా వున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఈ చిత్రం  హిలేరియస్ ఎంటర్ టైనర్ అని భరోసా ఇస్తోంది.  

బ్లాక్ బస్టర్ ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో ఈ చిత్రానికి మ్యూజిక్ అందిస్తున్నారు. కో ప్రొడ్యూసర్లు షేక్ రఫీ, బిట్టు, రాము వురుగొండ వ్యవహరిస్తున్నారు.  డీవోపీ గా వేణు మురళీధర్, ఎడిటర్ గా ఉద్ధవ్ పని చేస్తున్నారు.  

తారాగణం: విజె సన్నీ, సప్తగిరి, నక్షత్ర, అక్సాఖాన్, బిత్తిరి సత్తి ,షకలక శంకర్, పృథ్వీ, డిజే టిల్లు మురళి, సూపర్ విమెన్ లిరీషా, రాజా రవీంద్ర, పోసాని కృష్ణ మురళి, చమ్మక్ చంద్ర, విరాజ్ ముత్తంశెట్టి, గీతా సింగ్, రోహిణి, రూప లక్ష్మీ, మణి చందన, విక్రమ్ ఆదిత్య, రఘుబాబు, ఆనంద్ చక్రపాణి, గబ్బర్ సింగ్ బ్యాచ్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం : డైమండ్ రత్నబాబు
నిర్మాత : రజిత్ రావు
బ్యానర్ : ఎ2 బి ఇండియా ప్రొడక్షన్
కోప్రోడ్యుసర్లు: షేక్ రఫీ, బిట్టు, రాము వురు గొండ
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
డీవోపీ: వేణు మురళీధర్
ఎడిటర్ : ఉద్ధవ్
లిరిక్స్ : కాసర్ల శ్యామ్
స్టంట్స్ : నందు
కోరియోగ్రఫీ: భాను
పీఆర్వో : వంశీ- శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close