MOVIE NEWS

నాగ శౌర్య, పవన్ బాసంశెట్టి, సుధాకర్ చెరుకూరి, SLV సినిమాస్ రంగబలి జూలై 7న ప్రపంచవ్యాప్తం గా విడుదల

Naga Shaurya, Pawan Basamsetti, Sudhakar Cherukuri, SLV Cinemas Rangabali Releasing Worldwide On July 7th

Rangabali

యంగ్ అండ్  ప్రామిసింగ్ హీరో నాగ శౌర్య రంగబలి అనే ఆసక్తికరమైన ప్రాజెక్ట్ కోసం డెబ్యూ  దర్శకుడు పవన్ బాసంశెట్టి తో కలిసి పనిచేస్తున్నారు. ఉగాది నాడు విడుదల చేసిన టైటిల్ అనౌన్స్‌మెంట్ వీడియో, పల్లెటూరి నేపథ్యం లో సాగే కథతో రంగబలి ఫన్ రైడ్‌ గా ఉండబోతోందనే సూచనను అందిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్‌ లతో విభిన్నమైన చిత్రాలను తెరకెక్కించడంలో మంచి అభిరుచి ఉన్న ఎస్‌ ఎల్‌ వి సినిమాస్‌ కు చెందిన సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని అత్యంత వైభవంగా నిర్మిస్తున్నారు.

లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే.. రంగబలి జూలై 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలవుతోంది. నాగ శౌర్య ట్రెండీ గెటప్‌ లో కనిపిస్తున్న పోస్టర్ ద్వారా మేకర్స్ ఈ వార్తను అధికారికంగా ప్రకటించారు.

ఈ సినిమాలో నాగ శౌర్య విభిన్నమైన పాత్ర లో నటిస్తున్నాడు  అందుకు అతను మేకోవర్ చేసాడు. ఈ చిత్రంలో  ప్రముఖ సాంకేతిక నిపుణులు వివిధ  క్రాఫ్ట్‌ లలో పని  చేస్తున్నారు.

దివాకర్ మణి సినిమాటోగ్రఫీ, పవన్ సి హెచ్ సంగీత దర్శకుడు. ఎడిటర్‌ కార్తీక శ్రీనివాస్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ ఎఎస్‌ ప్రకాష్‌.

ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. హీరోయిన్, ఇతర వివరాలను త్వరలోనే తెలియజేస్తారు మేకర్స్.

తారాగణం: నాగ శౌర్య

సాంకేతిక సిబ్బంది:

రచయిత, దర్శకుడు: పవన్ బాసంశెట్టి

నిర్మాత: సుధాకర్ చెరుకూరి

బ్యానర్: SLV సినిమాస్

సంగీతం: పవన్ సిహెచ్

DOP: దివాకర్ మణి

ఎడిటర్: కార్తీక శ్రీనివాస్

కళ: ఏఎస్ ప్రకాష్

PRO: వంశీ-శేఖర్

Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close