MOVIE NEWS

పంజా వైష్ణవ్ తేజ్, సితార ఎంటర్టైన్మెంట్స్ ‘PVT04’కి సంగీత దర్శకుడిగా జి.వి. ప్రకాష్ కుమార్

GV PRAKASH KUMAR to compose music for Panja Vaisshnav Tej and Sithara Entertainments' PVT04

తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన సితార ఎంటర్‌టైన్‌మెంట్స్.. పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, జోజు జార్జ్, అపర్ణా దాస్ ప్రధాన పాత్రలు పోషిస్తున్న ‘PVT04′(వర్కింగ్ టైటిల్) తో అలరించడానికి సిద్ధమవుతోంది. ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సహనిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఈ సినిమాతో రచయితగా, దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.

ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్ పై రోజురోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. చిత్ర తారాగణంలో లేటెస్ట్ సెన్సేషనల్ టాలెంట్ శ్రీలీలతో పాటు.. ప్రతిభగల నటీనటులు జోజు జార్జ్, అపర్ణా దాస్ చేరడంతో సినిమాపై అంచనాలు రెట్టింపు అయ్యాయి.

తన తొలి చిత్రం ‘ఉప్పెన’తో సంచలన విజయాన్ని అందుకుని, అందరినీ ఆకట్టుకున్న పంజా వైష్ణవ్ తేజ్ విభిన్నమైన జోనర్‌లను ఎంచుకుంటున్నారు. అన్ని రకాల చిత్రాలలో నటిస్తూ, తనలోని నటుడిని విభిన్న కోణాలలో ప్రదర్శించాలని చూస్తున్నారు. ఇప్పుడు ఆయన ఓ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు.

మునుపెన్నడూ చూడని పాత్రలో ఆయన్ను చూడబోతున్నామని సినిమా అనౌన్స్‌మెంట్ వీడియో స్పష్టం చేసింది. ఇక టీజర్ ఈ సినిమాపై అంచనాలకు తారాస్థాయికి తీసుకెళ్లింది.

ఇప్పుడు ఈ సినిమాని మరోస్థాయికి తీసుకెళ్లడానికి ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ రంగంలోకి దిగుతున్నారు. ఈ చిత్రానికి జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందించబోతున్నట్లు మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ధనుష్‌ కథానాయకుడిగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంయుక్తంగా నిర్మించిన సార్/వాతి తో మ్యూజికల్ బ్లాక్‌బస్టర్‌ను అందించారు జి.వి. ప్రకాష్ కుమార్.

PVT04 ఆల్బమ్ ఖచ్చితంగా మరో పెద్ద చార్ట్‌బస్టర్‌గా కానుందని చిత్రం బృందం నమ్మకంగా ఉంది. త్వరలో గ్లింప్స్ ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

తారాగణం: పంజా వైష్ణవ్ తేజ్, శ్రీలీల, అపర్ణా దాస్, జోజు జార్జ్ తదితరులు

రచన, దర్శకత్వం: శ్రీకాంత్ ఎన్ రెడ్డి

సంగీత దర్శకుడు:  జి.వి. ప్రకాష్ కుమార్

నిర్మాతలు: ఎస్. నాగ వంశీ, ఎస్. సాయి సౌజన్య

బ్యానర్స్: సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్

సమర్పణ: శ్రీకర స్టూడియోస్

డీఓపీ: డడ్లీ

ఆర్ట్: ఏఎస్ ప్రకాష్

ఎడిటర్: నవీన్ నూలి

Tags

Related Articles

Back to top button
Close
Close