MOVIE NEWS

సుధీర్ బాబు, జ్ఞానసాగర్ ద్వారక, సుమంత్ జి నాయుడు, ఎస్ఎస్ సి  పాన్ ఇండియా మూవీ ‘హరోం హర’ ఫస్ట్ ట్రిగ్గర్ విడుదల, డిసెంబర్ 22న థియేట్రికల్ రిలీజ్

Sudheer Babu, Gnanasagar Dwaraka, Sumanth G Naidu, SSC’S Pan India Film Harom Hara First Trigger Out, Theatrical Release On December 22nd

Harom-Hara-First-Trigger-Out

సుధీర్ బాబు పాన్ ఇండియాచిత్రం  ‘హరోం హర’ సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వంలో ఎస్ఎస్ సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు. ‘ది రివోల్ట్’ అనేది సినిమా ట్యాగ్‌లైన్. రేపు సుధీర్ బాబు పుట్టినరోజు జరుపుకోనున్నారు. అడ్వాన్స్ విశేష్ తెలియజేస్తూ మేకర్స్- ఫస్ట్ ట్రిగ్గర్ వీడియోను విడుదల చేశారు.

రేడియోలో వాతావరణ రిపోర్ట్ తో వీడియో ప్రారంభమవుతుంది. కొంతమంది వ్యక్తులు తమ చేతుల్లో ఆయుధాలతో వస్తారు.  అతని ముఖం కనిపించనప్పటికీ సుధీర్ బాబు కుర్చీలో కూర్చుని చేతిలో తుపాకీ పట్టుకుని కనిపిస్తారు. చివరగా  అతని తుపాకీ నుండి ఫస్ట్  ట్రిగ్గర్ విడుదలౌతుంది. “అందరు పవర్ కోసం గన్ పట్టుకుంటారు… కానీ ఇది యాడాడో తిరిగి నన్ను పట్టుకుంది… ఇది నాకేమో సెప్తావుంది…” అని సుధీర్ బాబు కుప్పం యాసలో అదరగొట్టాడు.

 మాండలికం,  అతని వాయిస్ బేస్ పాత్రకు ఇంటెన్స్  తెస్తుంది. సుధీర్ బాబు సినిమా కోసం పూర్తిగా మేక్ఓవర్ అయ్యారు.   ఫస్ట్  ట్రిగ్గర్ యాక్షన్ తో నిండివుంది. సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది. హరోం హర కథ 1989లో చిత్తూరు జిల్లా కుప్పంలో జరుగుతుంది.

గ్లింప్స్ ద్వారా ఈ ఏడాది డిసెంబర్ 22న క్రిస్మస్ సెలవుల సందర్భంగా హరోం హర ను విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

అరవింద్ విశ్వనాథన్ సినిమా సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. విజువల్స్ గ్లింప్స్ లో అద్భుతంగా కనిపించాయి.  చైతన్ భరద్వాజ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎలివేషన్స్ ఇస్తుంది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా పాన్-ఇండియా విడుదల కానుంది.

తారాగణం: సుధీర్ బాబు

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం – జ్ఞానసాగర్ ద్వారక
నిర్మాత – సుమంత్ జి నాయుడు
సంగీతం – చైతన్ భరద్వాజ్
డీవోపీ – అరవింద్ విశ్వనాథన్
ఎడిటర్ – రవితేజ గిరిజాల
బ్యానర్ – శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్
పీఆర్వో – వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close