MOVIE NEWS

లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ ‘మేమ్ ఫేమస్’ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా విడుదల  

Geetha Arts Film Distribution To Release Lahari Films and Chai Bisket Films Mem Famous In Telugu States

Mem-Famous-In-Telugu-States

‘రైటర్ పద్మభూషణ్’ బ్లాక్ బస్టర్ విజయం తర్వాత లహరి ఫిల్మ్స్, చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్ కలిసి చేస్తున్న మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్ ‘మేమ్ ఫేమస్’. సుమంత్ ప్రభాస్ ప్రధాన పాత్ర పోషించడంతో పాటు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ హిలేరియస్ మ్యూజికల్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ ని అనురాగ్ రెడ్డి, శరత్, చంద్రు మనోహరన్ కలిసి నిర్మిస్తున్నారు. మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య , సిరి రాసి ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ‘మేమ్ ఫేమస్ టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్ విడుదల చేస్తుంది. ఈ మేరకు ఒక ఫన్నీ వీడియో ద్వారా  అనౌన్స్ చేశారు మేకర్స్. గీతా ఆఫీస్ ముందు సుమంత్ ప్రభాస్ అండ్ టీం.. ‘చిన్నపిల్లలు తింటారు లిటిల్ హార్ట్స్,.. మేమ్ ఫేమస్ డిస్ట్రిబ్యూషన్ తీసుకుంది గీతా ఆర్ట్స్” అంటే.. ఆఫీసు గేటు తీసి బయటికి వచ్చిన అల్లు అరవింద్ .. ”నేను ఎప్పుడు తీసుకున్నానుర్రా.. ?” అని ప్రశ్నించగా..”కొత్తోళ్ళం సర్.. ఛాయ్ బిస్కెట్” అని టీం సమాధానం చెప్పడం.. దాని అల్లు అరవింద్ హ్యాపీగా ఫీలై..  ’26మే..  డన్.. అందరూ రండి థియేటర్ కి” అని అల్ ది బెస్ట్ చెప్పే వీడియో ఆకట్టుకుంది.

ఇంతకుముందు ‘వర్షం పడుతోంది చమ్ చమ్ చమ్… మే 26న మేమ్ ఫేమస్ కి అందరూ కమ్ కమ్ కమ్ ‘ అంటూ హీరో విజయ్ దేవరకొండ చేసిన డేట్ అనౌన్స్ మెంట్ వీడియో కూడా వైరల్ అయ్యింది.

ఈ చిత్రానికి కళ్యాణ్ నాయక్ సంగీతం అందిస్తున్నారు. శ్యామ్ దూపాటి సినిమాటోగ్రఫీ అందిస్తున్న ఈ చిత్రానికి సృజన అడుసుమిల్లి ఎడిటర్, అరవింద్ మూలి ఆర్ట్ డైరెక్టర్.

మే 26న మేమ్ ఫేమస్’ విడుదలౌతుంది

తారాగణం: సుమంత్ ప్రభాస్,మణి ఏగుర్ల, మౌర్య చౌదరి, సార్య, సిరి రాసి, నరేంద్ర రవి, మురళీధర్ గౌడ్, కిరణ్ మచ్చ, అంజిమామ, శివ నందన్

సాంకేతిక విభాగం:
రచన, దర్శకత్వం: సుమంత్ ప్రభాస్
నిర్మాతలు: అనురాగ్ రెడ్డి,శరత్ చంద్ర, చంద్రు మనోహర్
బ్యానర్లు: చాయ్ బిస్కెట్ ఫిల్మ్స్, లహరి ఫిల్మ్స్
సంగీతం: కళ్యాణ్ నాయక్
డీవోపీ: శ్యామ్ దూపాటి
ఎడిటర్: సృజన అడుసుమిల్లి
ఆర్ట్ : అరవింద్ మూలి
ఎగ్జిక్యూటివ్ ప్రోడ్యుసర్ : సూర్య చౌదరి
పీఆర్వో: వంశీ-శేఖర్
క్రియేటివ్ ప్రోడ్యుసర్స్: ఉదయ్-మనోజ్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Check Also

Close
Back to top button
Close
Close