
స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023: ‘బలగం’ చిత్రానికిగానూ ఉత్తమ నటుడుగా ప్రియదర్శి, ఉత్తమ సహ నటుడు అవార్డులను గెలుచుకున్న కేతిరి సుధాకర్ రెడ్డి
*Swedish International Film Festival 2023: Priyadarshi wins Best Actor & Kethiri Sudhakar Reddy wins Best Supporting actor award for Balagam*

హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు సమర్పణలో దిల్‌రాజు ప్రొడక్షన్స్ బ్యానర్‌పై హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మాతలుగా రూపొందించిన చిత్రం ‘బలగం’. కమెడియన్ వేణు ఎల్దండి దర్శకత్వం వహించారు. హార్ట్ టచింగ్ ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా ప్రేక్షకులు, విమర్శకుల నుంచి అద్భుతమైన స్పందనను రాబట్టుకుంది. కలెక్షన్స్‌తో పాటు ప్రశంసలను కూడా అందుకుందీ చిత్రం. వర్డ్ ఆఫ్ మౌత్ టాక్‌తో బలగం సినిమా తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ ఏడాది విడుదలైన చిత్రాల్లో బలగం సినిమా తనదైన స్థానాన్ని సంపాదించుకుంది. ఇప్పుడు అంతర్జాతీయంగా అనేక అవార్డులను సొంతం చేసుకుంటోంది. బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ డ్రామా మూవీ, బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్, బెస్ట్ సినిమాటోగ్రాఫర్ ఇలా పలు అవార్డులను అంతర్జాతీయంగా దక్కించుకుంటోంది బలగం సినిమా. తాజాగా ఈ లిస్టులో మరో రెండు అంతర్జాతీయ అవార్డులు వచ్చి చేరాయి. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు అద్దం పట్టి ఎన్నో ఇంటర్నేషనల్ అవార్డులను దక్కించుంటోన్న బలగం స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ 2023లో.. ఉత్తమ నటుడు అవార్డు ప్రియదర్శికి, ఉత్తమ సహాయ నటుడు అవార్డును కేతిరి సుధాకర్ రెడ్డికి వచ్చింది. ఇది నిజంగా గొప్ప ఎచీవ్‌మెంట్. ఎందుకంటే ఈ స్వీడిష్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో.. 2021 ఏడాదిలో ఫహాద్ ఫాజిల్ జోజికు ఉత్తమ చిత్రంగా అవార్డు వచ్చింది. అలాగే గత ఏడాది మలయాళ చిత్రం నాయట్టు సినిమాకు అవార్డ్ వచ్చింది. తర్వాత ఆ లిస్టులో బలగం సినిమా చేరింది.
తెలంగాణ ప్రాంతాన్ని ఎలివేట్ చేస్తూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవటమే కాదు. పలు అవార్డులను గెలుచకున్న బలగం సినిమా ఇప్పడు టార్చ్ బేరర్‌గా మారింది. నిజాయతీగా, జెన్యూన్‌గా రాసిన కథ, మూవీ మేకింగ్‌తో తెలంగాణలోని సిరిసిల్ల అనే ప్రాంతంలో తెరకెక్కించిన బలగం చిత్రం ఇప్పుడు అంతర్జాతీయ వేదికలపై అవార్డులను గెలుచుకుంటోంది.
ఓ కుటుంబంలోని పెద్ద మనిషి చనిపోతే అక్కడ ఉండే మనుషుల మధ్య ఉండే బంధాలు, అనుబంధాలు, భావోద్వేగాల చుట్టూ కథాంశంతో బలగం సినిమా రూపొందింది. ప్రియదర్శి పులికొండ, కావ్యా కళ్యాణ్ రామ్, మురళీధర్ గౌడ్, రూప లక్ష్మి, సుధాకర్ రెడ్డి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని అందించారు.