MOVIE NEWS

మోస్ట్ టాలెంటెడ్ అండ్ నేషనల్అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది.

National award winning director Neelakanta, who previously won national award for ‘Show’ film is up with another interesting film now.

మోస్ట్ టాలెంటెడ్ అండ్ నేషనల్అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ నీలకంఠ నుంచి మరో ఇంట్రెస్టింగ్ సినిమా రాబోతోంది. గతంలో షో అనే ఫీచర్ ఫిల్మ్ తో బెస్ట్ ఫీచర్ ఫిల్మ్, బెస్ట్ స్క్రీన్ ప్లే విభాగాల్లో రెండు జాతీయ అవార్డులు, అలాగే విరోధి మరియు షో చిత్రాలు ఇండియన్ పనోరమ లో కూడ సెలెక్ట్ అయ్యాయి.ఆ చిత్రాల దర్శకుడు  నీలకంఠ ఆ తర్వాత కమర్షియల్ సక్సెస్ తో పాటు విమర్శకుల ప్రశంసలు కూడా అందుకున్న మిస్సమ్మ, సదా మీ సేవలో వంటి  చిత్రాలతో ఆకట్టుకున్నారు. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు మరోసారి ‘సర్కిల్’ అనే చిత్రంతో వస్తున్నాడు నీలకంఠ. ఈ చిత్రానికి ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ లైన్ ఆకట్టుకుంటోంది.

తాజాగా ఈ చిత్ర టైటిల్ తో పాటు మోషన్ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఈ మోషన్ పోస్టర్ ఆసక్తికరంగా ఉంది. ఒక మోడల్ ఫోటో కెమెరా లెన్స్ తిరుగుతుండగా.. దానితో పాటు ఎవరు, ఎప్పుడు, ఎందుకు శతృవులవుతారో అనే ట్యాగ్ తో ఎండ్ అవుతుందీ మోషన్ పోస్టర్. చూస్తోంటే ఇది మరోసారి నీలకంఠ తరహాలోనే సాగే వైవిధ్యమైన సినిమాగా కనిపిస్తోంది. దీంతో పాటు చిత్ర తారాగణం సైతం ఆసక్తికరంగానే ఉంది.

ఆరా  ప్రొడక్షన్స్ బ్యానర్ పై రూపొందుతోన్న ఈ సర్కిల్ చిత్రంలో నటీనటులు

సాయి రోనక్, బాబా భాస్కర్, అర్షిణ్‌ మెహతా,రిచా పనై, నైనా , పార్థవ సత్య తదితరులు ..

సాంకేతిక నిపుణులు ః

సినిమాటోగ్రపీ : రంగనాథ్ గోగినేని
ఎడిటర్ : మధు రెడ్డి
సంగీతం : ఎన్.ఎస్ ప్రశు
నిర్మాతలు : ఎమ్.వి శరత్ చంద్ర, టి సుమలత అన్నిత్ రెడ్డి, వేణుబాబు అడ్డగడ
రచన, దర్శకత్వం : నీలకంఠ

Tags

Related Articles

Back to top button
Close
Close