GALLARYMOVIE NEWSVIDEOSVideos Songs

‘అంతిమ తీర్పు’ చిత్రంలో మంగ్లీ పాడిన
‘టిప్ప.. టిప్ప’ పాటకు అద్భుతమైన స్పందన

Mangli sang in the movie 'AnthimaTheerpu' Great response to the song 'Tippa.. Tippa'

సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్‌రామన్‌, అమిత్‌ తివారీ కీలక పాత్రధారులుగా రూపొందుతున్న చిత్రం ‘అంతిమ తీర్పు’. ఎ. అభిరాం దర్శకత్వంలో సిద్ధి వినాయక డి.రాజేశ్వరరావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్‌ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ అంటూ సాగే పాటను సాంగ్‌ ఇటీవల విడుదల చేశారు. కోటి సంగీతం అందించారు. కాసర్ల శ్యామ్‌ రచించిన పాట ఇది. మంగ్లీ ఆలపించారు. అమిత్‌తివారీ, స్నేహా గుప్తా ఆ పాటలో ఆడాపాడారు. ఈశ్వర్‌ పెంటి ఈ పాటకు డాన్స్‌ కొరియోగ్రఫీ చేశారు.

దర్శకనిర్మాతలు మాట్లాడుతూ ‘‘చక్కని కథాంశంతో రూపొందిన చిత్రమిది. చిత్రీకరణ పూర్తయింది. ‘టిప్పా టిప్పా’ సాంగ్‌ చక్కని డాన్స్‌ నంబర్‌. ఈ పాటను డాగ్‌ హౌస్‌లో నాలుగు రోజులపాటు చిత్రీకరణ చేశాం. టి.సిరీస్‌ ద్వారా విడుదల చేశాం. కోటి గారు ప్రతి పాటకు చక్కని స్వరాలు అందించారు. ఇటీవల విడుదల చేసిన ‘టిప్పా టిప్పా..టిప్ప.. టిప్పర్‌ లారీ నా ఒళ్లే.. రప్ప..రప్ప.. రప్ప వత్తే యాక్సిడేంటేలే’ పాటకు అద్భుతమైన స్పందన వస్తోంది. మంగ్లీ హస్కీ వాయిస్‌తో పాడిన ఈ పాట సోషల్‌ మీడియాలో ట్రెండ్‌ అవుతోంది. ఇదే ఉత్సాహంతో ‘త్వరలో సెకెండ్‌ లిరికల్‌ సాంగ్‌, టీజర్‌ను విడుదల చేస్తాం. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అని అన్నారు.


నటీనటులు:
సాయి ధన్సిక, విమలారామన్‌, గణేష్‌ వెంకట్‌రామన్‌, అమిత్‌ తివారీ, దీపు, సత్య ప్రకాశ్‌, నాగ మహేశ్‌ తదితరులు.

సాంకేతిక నిపుణులు:
కెమెరా: ఎస్‌.సుధాకర్‌ రెడ్డి
సంగీతం: కోటి
ఎడిటర్‌: గ్యారీ బి.హెచ్‌
స్టంట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, దేవరాజ్‌
కొరియోగ్రఫి: ఈశ్వర్‌ పెంటి
ఛీప్‌ కో డైరెక్టర్‌: బండి రమేష్‌
పి.ఆర్‌.ఓ: మధు విఆర్‌.

Tags

Related Articles

Back to top button
Close
Close