MOVIE NEWS

ఆర్య-గౌతమ్ కార్తీక్  “మిస్టర్. X” అనౌన్స్ మెంట్

Arya-Goutham Karthik “Mr. X” announcement

ప్రిన్స్ పిక్చర్స్ ఆర్య, గౌతమ్ కార్తీక్ ప్రధాన పాత్రలలో ‘మిస్టర్ ఎక్స్’ అనే కొత్త ప్రాజెక్ట్‌ను అఫీషియల్ గా అనౌన్స్ చేశారు.

అనౌన్స్ మెంట్ తో విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌లకు అద్భుతమైన స్పందన వస్తోంది.

ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రంలో గౌతమ్‌ కార్తీక్‌ విలన్‌గా నటిస్తున్నారు

ఈ చిత్రానికి ‘ఎఫ్‌ఐఆర్’ సినిమా ఫేమ్ మను ఆనంద్ రచన, దర్శకత్వం  వహిస్తున్నారు. ఇది యాక్షన్ ప్యాక్డ్ ఎంటర్‌టైనర్‌గా ఉంటుంది. ఈ చిత్రంలో ఉగాండా, సెర్బియాలో చిత్రీకరించబడే హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి.

ధిబు నినన్ థామస్ (మరగధ నానయం, బ్యాచిలర్, కనా & నెంజుకు నీది ఫేమ్) ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు.

తన్వీర్ మీర్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ప్రసన్న జీకే ఎడిటర్.

రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్. స్టంట్ సిల్వా యాక్షన్ సీక్వెన్స్‌లకు కొరియోగ్రఫీ చేస్తున్నారు. ఇందులాల్ కవీద్ ఆర్ట్ వర్క్‌లను పర్యవేక్షిస్తున్నారు. ఉత్తరా మీనన్ కాస్ట్యూమ్ డిజైన్.

ఏపీ పాల్ పాండి ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్.

శ్రవంతి సాయినాథ్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్

ఎ. వెంకటేష్ సహ నిర్మాత.

ప్రిన్స్ పిక్చర్స్  ఎస్.లక్ష్మణ్ కుమార్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలో తెలియజేస్తారు.

ఈ చిత్రాన్ని తెలుగు తమిళ్ కన్నడ మలయాళం హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు .
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close