MOVIE NEWS

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ ల ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయి

*Ustaad Bhagat Singh Music Sittings Begin with Blockbuster duo Harish Shankar and Devi Sri Prasad*

* శరవేగంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్ర నిర్మాణ పనులు

* ప్రారంభమైన మ్యూజిక్ సిట్టింగ్స్

* ‘గబ్బర్ సింగ్’ని మించిన ఆల్బమ్ అందించడానికి కసరత్తులు

‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మరో మాస్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ కోసం చేతులు కలిపారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్ర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇప్పటికే చిత్రీకరణ ప్రారంభమైంది. పది రోజుల పాటు జరిగిన మొదటి షెడ్యూల్ లో కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. మొదటి షెడ్యూల్ కి సంబంధించిన ఎడిటింగ్ పనులు కూడా ఇప్పటికే మొదలయ్యాయి. ఇక తాజాగా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలవ్వడం విశేషం.

పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్, దేవి శ్రీ ప్రసాద్ కలయికలో వచ్చిన ‘గబ్బర్ సింగ్’ ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో తెలిసిందే. సంచలన వసూళ్లతో సరికొత్త రికార్డులు సృష్టించింది. ‘గబ్బర్ సింగ్’ విజయంలో సంగీతం కూడా కీలక పాత్ర పోషించింది. ఆ సినిమాలోని ప్రతి పాట బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. చిత్రంలోని పాటలు దశాబ్దం తరువాత కూడా నేటికీ మారుమ్రోగుతూ ప్రేక్షకులు కాలు కదిపేలా చేస్తున్నాయి. అలాంటి మ్యాజిక్ నే మరోసారి రిపీట్ చేయడానికి సిద్ధమయ్యారు ఈ త్రయం.

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మ్యూజిక్ సిట్టింగ్స్ మొదలయ్యాయని తెలుపుతూ తాజాగా మేకర్స్ ఓ ప్రత్యేక వీడియోను విడుదల చేశారు. అందులో “అరేయ్ సాంబ రాస్కోరా” అంటూ గబ్బర్ సింగ్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ వినిపించింది. అలాగే వీడియోలో దేవి శ్రీ ప్రసాద్, హరీష్ శంకర్ ఎంతో ఉత్సాహంగా కనిపిస్తున్నారు. వారి ఉత్సాహం చూస్తుంటే ‘గబ్బర్ సింగ్’ని మించిన బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందించబోతున్నారని అర్థమవుతోంది.  ఈ చిత్రానికి సంబంధించిన ఇతర వివరాలు మరియు తదుపరి షెడ్యూల్ వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

తారాగణం: పవన్ కళ్యాణ్, శ్రీలీల, అశుతోష్ రాణా, నవాబ్ షా, కేజీఎఫ్ అవినాష్, గౌతమి, నర్రా శ్రీను, నాగ మహేష్, టెంపర్ వంశీ తదితరులు

రచన-దర్శకత్వం: హరీష్ శంకర్. ఎస్

నిర్మాతలు: నవీన్ ఎర్నేని, రవి శంకర్ యలమంచిలి

బ్యానర్: మైత్రి మూవీ మేకర్స్

సీఈవో: చెర్రీ

సంగీతం: దేవీ శ్రీ ప్రసాద్

సినిమాటోగ్రఫీ: అయనంకా బోస్

ఎడిటింగ్: చోటా కె. ప్రసాద్

ప్రొడక్షన్ డిజైనర్: ఆనంద్ సాయి

ఫైట్స్: రామ్-లక్ష్మణ్

ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్స్: రావిపాటి చంద్రశేఖర్, హరీష్ పాయ్

పీఆర్ఓ: లక్ష్మీవేణుగోపాల్

Tags

Related Articles

Back to top button
Close
Close