MOVIE NEWS

ఖుషీ నుంచి సమంత బర్త్ డే స్పెషల్ పోస్టర్

Samantha looks Bright & Beautiful in Birthday Special Poster from ‘Kushi’

టాలెంటెడ్ అండ్ బ్యూటీఫుల్ యాక్ట్రెస్ సమంత.. వైవిధ్యమైన చిత్రాలతో దూసుకుపోతోంది. విమెన్ సెంట్రిక్ మూవీస్ తోనూ ఆకట్టుకుంటోంది. రీసెంట్ గా వచ్చిన యశోద, శాకుంతలం చిత్రాల్లోని నటనతో మెప్పించింది. త్వరలోనే తను ఖుషీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. గతేడాదే రావాల్సిన సినిమా సమంత అనారోగ్య సమస్యల వల్ల ఆలస్యమైంది. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తోన్న ఈ చిత్రానికి శివ నిర్వాణ దర్శకుడు. 

లేటెస్ట్ గా సమంత బర్త్ డే సందర్భంగా  ఖుషీ నుంచి కొత్త పోస్టర్ విడుదల చేసింది మూవీ టీమ్. చూడగానే ఆకట్టుకునేలా ఉన్న ఈ స్టిల్ లో సమంత ఐడి కార్డ్ వేసుకుని ఏదో సాఫ్ట్ వేర్ ఆఫీస్ లోకి వెళుతున్నట్టుగా ఉంది. తన లుక్ బర్త్ డే మూడ్ కు తగ్గట్టుగా చాలా జాయ్ ఫుల్ గా కనిపిస్తోంది. 

ఈ సందర్భంగా తనకు విజయ్ దేవరకొండతో పాటు పలువురు సినీ ప్రముఖులు బర్త్ డే విషెస్ చెబుతూ పోస్టర్ ను అభినందిస్తున్నారు.
ప్రస్తుతం చివరి షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోన్న ఖుషీ చిత్రాన్ని ఈ యేడాది సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు.

Tags

Related Articles

Back to top button
Close
Close