EventEvents/PressmeetsGALLARYMOVIE NEWS

అత్యంత ప్రేమాభిమానాల మధ్య ఉపాసన కామినేని కొణిదెల సీమంతం!

Parents to be, Upasana Kamineni Konidela and Ram Charan's Baby Shower's are All things love !

వైరల్ అవుతోన్న ఉపాసన కామినేని కొణిదెల బేబీ షవర్ ఫొటోలు

గ్లోబల్‌ స్టార్‌ రామ్‌చరణ్‌, ఎక్సలెంట్‌ లేడీ ఉపాసన కామినేని కొణిదెల మొదటి నుంచీ అందరి మెప్పు పొందుతున్న ముచ్చటైన జంట. ఆమె గురించి అతను ఎక్కడ మాట్లాడినా ఆప్యాయత కురిసినట్టు ఉంటుంది. మిస్టర్‌ సీ అంటూ అతని కోసం ఆమె ఏం రాసినా అద్భుతంగా అనిపిస్తుంది. ఒకరినొకరు అర్థం చేసుకుని, కలిసిమెలిసి ఉండాల్సిన దంపతులకు బెస్ట్ ఎగ్జాంపుల్‌గా అనిపిస్తుంటారు ఇద్దరూ. వారి మధ్య అన్యోన్యతకు మన దగ్గరివారే కాదు, అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులు ఆనందించారు. ఆస్కార్‌కి రెడీ అవుతున్న ఈ దంపతుల మీద ఆ మధ్య వేనిటీ ఫెయిర్‌ ఓ వీడియో రికార్డ్ చేసింది. వేనిటీ ఫెయిర్‌ ఇప్పటిదాకా అప్‌లోడ్‌ చేసిన అన్నీ వీడియోల రికార్డులనూ బద్ధలు కొట్టేశారు ఉపాసన రామ్‌చరణ్ దంపతులు. గర్భవతి అయిన తన భార్యను రామ్‌చరణ్‌ అపురూపంగా చూసుకుంటున్న తీరుపై ప్రశంసలు కురుస్తున్నాయి.

దుబాయ్‌లో జరిగిన సీమంతం ఫొటోలు కూడా వేగంగా వైరల్‌ అయ్యాయి. అదొక్కటే కాదు, ఆ తర్వాత కూడా అత్యంత సన్నిహితుల మధ్య హైదరాబాద్‌లో మరో రెండు వేడుకలు వైభవంగా జరిగాయి. ఒక వేడుకలో ఉపాసన పింక్‌ షిమ్మరీ వస్త్రాలంకరణతో మెరిసిపోయారు. మరో చోట బ్లూ ఫ్రీ ఫ్లోయింగ్ డ్రెస్‌తో తళుకులీనారు. రామ్‌చరణ్‌ తనకు నచ్చిన నలుపు రంగు దుస్తుల్లో ఒకచోట, వైట్‌ షర్ట్ విత్‌ స్మార్ట్ చినోస్‌లో మరోచోట స్మార్ట్ గా కనిపించారు. ఈ పార్టీలకు అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యులు హాజరయ్యారు. పింకీ రెడ్డి, సానియా మీర్జా, కనికా కపూర్‌, అల్లు అర్జున్‌తోపాటు వారి కుటుంబసభ్యులు కూడా ఈ వేడుకలో అలరించారు. అలాగే కుటుంబసభ్యులు చిరంజీవి కొణిదెల, సురేఖ, చెల్లెళ్లు సుష్మిత, శ్రీజతో పాటు ఉపాస‌న త‌ల్లి శోభన కామినేని, సంగీతారెడ్డి, సుష్మిత, శ్రీజ కూడా ఈ వేడుకలో పాలుపంచుకుని ఆనందోత్సాహంలో మునిగిపోయారు. కాబోయే అమ్మ ఉపాసనను తమ ప్రేమాభిమానాలతో ఆహూతులందరూ ముద్దుచేశారు. గత కొన్నాళ్లుగా వరుస వేడుకలతో బిజీగా ఉన్న ఉపాసన చరణ్‌ దంపతులను భగవంతుడు పుత్రోత్సాహంలో ముంచెత్తే క్షణాల కోసం వేచిచూస్తున్నామని అంటున్నారు సన్నిహితులు. ఈ ఫొటోలు సోష‌ల్ మీడియా మాధ్య‌మాల్లో తెగ‌ వైర‌ల్ అవుతున్నాయి.

Tags

Related Articles

Back to top button
Close
Close