MOVIE NEWS

ఆశిష్, కాశీ విశాల్, దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్‘సెల్ఫిష్’ నుంచి చైత్ర గా ఇవానా పరిచయం  

Meet Chaitra, Reserving Ivana To The World Of Ashish, Kasi Vishal, Dil Raju’s Sri Venkateswara Creations, Sukumar Writings- Selfish

Selfish

తొలి చిత్రం ‘రౌడీ బాయ్స్’తో ఆకట్టుకున్న యంగ్ హీరో ఆశిష్ రెడ్డి, నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో సుకుమార్ రైటింగ్స్ , ప్రముఖ నిర్మాత దిల్ రాజు, శిరీష్ ల శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ నిర్మిస్తున్న యూత్ ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్ ‘సెల్ఫిష్’ తో వస్తున్నాడు.

ఇందులో ఆశిష్ మాస్ క్యారెక్టర్‌లో నటిస్తున్నాడు. గతంలో విడుదల చేసిన పోస్టర్‌లలో రెక్లెస్ యాటిట్యుడ్ చూపించాడు. ఇప్పుడు ఈ చిత్రంలో కథానాయిక నటిస్తున్నా ఇవానా ను చైత్ర పాత్రలో పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఇవానా ఎదో ఆందోళనలో వున్నట్లుగా కనిపించగా.. ఆశిష్ ఆమెని తదేకంగా చూస్తునట్లుగా కనిపించారు.

ఐడీ కార్డ్ సూచించినట్లుగా ఇవానా ఇందులో ఫైనాన్సియల్ ఎనలిస్ట్ గా కనిపిస్తుంది. పోస్టర్‌లో ఇవానా సింపుల్‌గా కనిపించింది. ఆశిష్ గిరజాల జుట్టు, గడ్డంతో మోడిష్‌గా కనిపిస్తున్నాడు.

రిజర్వడ్ ఫర్ మై లవ్ అనే గూగుల్ సెర్చ్ స్పేష్ కనిపిస్తోంది. ఈ కథ హైదరాబాద్‌లోని పాతబస్తీలో జరుగుతుంది. ఆశిష్ సెల్ఫిష్ ఓల్డ్ సిటీ వ్యక్తిగా కనిపిస్తాడు. అతను జీవితంలోని తీపిని మాత్రమే కోరుకునే వ్యక్తి.  

హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి ఈ చిత్రానికి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తుండగా, ఎస్ మణికంధన్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తున్నారు. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి చంద్రబోస్ లిరిక్ రైటర్‌. ప్రవీణ్ పూడి ఎడిటర్, కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్.

సెల్ఫిష్ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది.

తారాగణం: ఆశిష్ రెడ్డి. ఇవానా
సాంకేతిక విభాగం:
రచన దర్శకత్వం : కాశీ విశాల్
నిర్మాతలు: దిల్ రాజు-శిరీష్
బ్యానర్లు: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, సుకుమార్ రైటింగ్స్
సినిమాటోగ్రాఫర్: మణికంధన్
సంగీతం: మిక్కీ జె మేయర్
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
సాహిత్యం: చంద్రబోస్
సహ నిర్మాతలు: హర్షిత్ రెడ్డి, హన్షిత రెడ్డి, అశోక్ బండ్రెడ్డి
పీఆర్వో: మాడురి మధు, వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close