MOVIE NEWS

ఐశ్వర్య రాజేష్,  డ్రీమ్ వారియర్ పిక్చర్స్ ‘ఫర్హానా’ టీజర్‌ను లాంచ్ చేసిన రష్మిక మందన

Rashmika Mandanna Launches The Teaser of Dream Warrior Pictures 'Farhana' Starring Aishwarya Rajesh

Farhana

‘ఒకే ఒక జీవితం’, ‘సుల్తాన్’, ‘ఖైదీ’,  ‘ఖాకీ’ వంటి విలక్షణమైన, విజయవంతమైన చిత్రాలు అందించిన డ్రీమ్ వారియర్ పిక్చర్స్ మరో యూనిక్ కథతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ట్యాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్  ప్రధాన పాత్రలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మించిన ‘ఫర్హానా’.

తమిళంలో సూపర్‌హిట్‌ అయిన మాన్‌స్టర్‌, ఒరు నాల్‌ కూత్తు చిత్రాల అందించిన నెల్సన్‌ వెంకటేశన్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న రెయిన్‌బో చిత్రంలో కథానాయికగా నటిస్తున్న హీరోయిన్ రష్మిక మందన ఫర్హానా టీజర్‌ను విడుదల చేశారు.  

తన కుటుంబాన్ని పోషించడానికి ఫర్హానా(ఐశ్వర్య రాజేష్) కాల్ సెంటర్ ఉద్యోగంలో చేరుతుంది. కాలర్స్ ఫాంటసీలని ఎంటర్ టైన్ చేసే కాల్ సెంటర్ అది. ఈ ఉద్యోగం గురించి కుటుంబ సభ్యులకు తెలియడంతో ఆమె జీవితం తలకిందులౌతుంది.

విమన్ సెంట్రిక్ సినిమాలో ‘ఫర్హానా’ సరికొత్తగా కనిపిస్తోంది. ఈ చిత్రం కేవలం ఫర్హానా మాత్రమే కాకుండా సాధారణంగా స్త్రీల అనుభవాలు, వారి ద్రుష్టి కోణం ప్రజంట్ చేస్తోంది. బలమైన పాత్రల చుట్టూ ఆకట్టుకునే కథనంతో, మంచి సినిమాని ఇష్టపడే ప్రతి ఒక్కరూ తప్పక చూడవలసిన చిత్రం అవుతుంది.

ఈ కథ ఐశ్వర్య రాజేష్ పాత్ర చుట్టూ తిరుగుతుంది. ఆమె ఈ పాత్రని అద్భుతంగా పోషించారు. ఈ చిత్ర తారాగణంలో ప్రముఖ దర్శకుడు శ్రీ రాఘవ, ‘జితన్’ రమేష్, కిట్టి, అనుమోల్, ఐశ్వర్య దత్తా ఉన్నారు.

పన్నయరుమ్ పద్మినియుమ్, మాన్‌స్టర్ వంటి చిత్రాలలో తనదైన ముద్ర వేసిన గోకుల్ బెనాయ్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. డియర్ కామ్రేడ్, రాధే శ్యామ్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించిన జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. నేషనల్ అవార్డ్ విన్నర్ సాబు జోసెఫ్ ఎడిటర్.

మే 12న తమిళం, తెలుగు, హిందీ భాషల్లో ఫర్హానా విడుదల కానుంది.

తారాగణం: ఐశ్వర్య రాజేష్, శ్రీ రాఘవ, ఐశ్వర్య దత్తా, జితన్ రమేష్, అనుమోల్
కథ, దర్శకత్వం: నెల్సన్ వెంకటేశన్
ప్రొడక్షన్ హౌస్: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
నిర్మాతలు: ఎస్ ఆర్ ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: అరవేంద్రరాజ్ బాస్కరన్
క్రియేటివ్ ప్రొడ్యూసర్: తంగప్రభాహరన్ ఆర్
స్క్రీన్ ప్లే – నెల్సన్ వెంకటేశన్, శంకర్ దాస్,  రంజిత్ రవీంద్రన్
మాటలు: మనుష్యపుతిరన్, నెల్సన్ వెంకటేశన్ & శంకర్ దాస్
డీవోపీ: గోకుల్ బెనోయ్
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
ఎడిటర్: విజే సాబు జోసెఫ్
ఆర్ట్ డైరెక్టర్: శివశంకర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close