MOVIE NEWS

అక్షయ తృతీయ సందర్బంగా ఆదిపురుష్ నుంచి పవర్ ఫుల్ పోస్టర్, జై శ్రీ రామ్ సాంగ్ రిలీజ్ ..

On Akshaya Tritiya team Adipurush launches the powerful poster of Raghav starring Pan-India superstar Prabhas and on public demand drops divine 60 second lyrical of ‘Jai Shri Ram’ in 5 different languages!

అక్షయ తృతీయ సందర్భంగా అందరికీ శ్రేయస్సులు కలగాలని కోరుకుంటూ.. ఆదిపురుష్ మూవీ నుంచి జై శ్రీరామ్ నామం ప్రతిధ్వనించేలా ఒక లిరికల్ ఆడియో క్లిప్ ను విడుదల చేసింది టీమ్. సంగీత ద్వయం అజయ్-అతుల్ స్వరపరిచిన ఈ గీతాన్ని హిందీ, తమిళ్, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల చేశారు. భక్తి పాటలు కంపోజ్ చేయడంలో ది బెస్ట్ అనిపించుకున్న ఈ మ్యూజికల్ ద్వయం మరోసారి అద్భుతమైన ట్యూన్ తో ఆకట్టుకున్నారు. ఈ పాట సినిమా కె కాకుండా  ఏళ్ళ తరబడి వినిపించేలా.. జై శ్రీరామ్ అనే నినాదం మారుమ్రోగేలా ఉండబోతోంది.
ఈ ట్రాక్ కు అనుగుణంగా రాఘవ్ గా ప్రభాస్ అద్భుతమైన పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో శ్రీ రాముడు శౌర్యం, శక్తి, బలం కనిపిస్తోంది.
రాఘవుని సద్గుణం, దాతృత్వం, బలమైన పాత్ర స్వరూపం కనిపిస్తున్నాయి.తండ్రి వాక్కుకు కట్టుబడి, ఒకే బాణం ఒకే భార్య అనే మాటకు ఆదర్శనంగా నిలిచినా శ్రీ రామ లక్షణాలకు ప్రతీకగా ఈ పోస్టర్ కనిపిస్తోంది. మొత్తంగా అభిమానులకు ఈ అక్షయ తృతీయ సందర్భంగా అద్భుతమైన ట్రీట్ ఇచ్చింది ఆదిపురుష్ టీం.

ఓం  రౌత్ దర్శకత్వం వహించిన ఆదిపురుష్, టి-సిరీస్, భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, సుతారియా సుటారియా, రెట్రోఫైల్స్‌ రాజేష్ నాయర్  తో పాటు యు వి క్రియేషన్స్ కు చెందిన వంశీ ,ప్రమోద్ లు నిర్మించారు. ఆదిపురుష్ 16 జూన్ 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Tags

Related Articles

Back to top button
Close
Close