MOVIE NEWS

జూన్ 13, 2023న న్యూయార్క్‌లో జరిగే ప్రతిష్టాత్మక ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్..

Breaking News!! Adipurush To Have Its World Premiere At The Prestigious Tribeca Festival In New York on June 13, 2023

మాగ్నమ్ ఓపస్ ఆదిపురుష్ కొన్ని నెలల్లో విడుదల కానుంది. జాతీయ అవార్డు గెలుచుకున్న దర్శకుడు ఓం రౌత్ భారతీయ చరిత్ర, సంస్కృతిలో గొప్ప ఇతిహాసం, రామాయణ వర్ణనను చూడటానికి ప్రేక్షకులు చాలా ఉత్సాహంగా ఉన్నారు. భూషణ్ కుమార్ నిర్మించిన ఈ బృందం ఇప్పుడు భారతీయ సంస్కృతి యొక్క గొప్పతనాన్ని భారతీయ డయాస్పోరా మాత్రమే కాకుండా ప్రపంచం చూస్తుందని ప్రకటించింది. జూన్ 7-18 వరకు జరిగే ట్రిబెకా ఫెస్టివల్‌లో జూన్ 13న న్యూయార్క్‌లో ఈ చిత్రం వరల్డ్ ప్రీమియర్ ప్రదర్శించబడుతుంది. ఈ సినిమా జూన్ 16న ఇండియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ట్రిబెకా ఫెస్టివల్ కోసం లైనప్ ప్రకటించబడింది.  జ్యూరీ వరల్డ్ ప్రీమియర్‌ కోసం ఆదిపురుష్‌ని ఎంపిక చేసింది. 2001లో రాబర్ట్ డి నీరో, జేన్ రోసెంతల్ మరియు క్రెయిగ్ హాట్‌కాఫ్‌లచే స్థాపించబడిన OKX ద్వారా సమర్పించబడిన ట్రిబెకా ఫెస్టివల్, కళాకారులు, విభిన్న ప్రేక్షకులను ఒకచోట చేర్చి అన్ని రకాల కథలను పంచుకుంటారు. ట్రిబెకా ఫిలిం ఫెస్టివల్  సృజనాత్మక, వినోదానికి పర్యాయపదంగా ఉంది. విజువల్ ఫీస్ట్‌గా రాబోతోన్న   ఆదిపురుష్ 3D ఫార్మాట్‌లో “మిడ్‌నైట్ ఆఫరింగ్”గా ఫెస్టివల్‌లో ప్రదర్శించబడుతుంది.

ఈ అద్భుతమైన ఫీట్ డైరెక్టర్ గురించి ఓం రౌత్  మాట్లాడుతూ  “ఆదిపురుష్ సినిమా కాదు, ఇది ఒక ఎమోషన్, సెంటిమెంట్. ఇది భారతదేశ స్ఫూర్తితో ప్రతిధ్వనించే కథ. ఒక విద్యార్థిగా నేను ఎప్పుడూ ఉండాలని కోరుకునే ప్రపంచంలోని ప్రతిష్టాత్మక చలన చిత్రోత్సవాలలో ఒకటైన  ట్రెబెకా జ్యూరీ ఆదిపురుష్‌ని ఎంపిక చేసిందని తెలుసుకున్నప్పుడు..  ట్రిబెకా ఫెస్టివల్‌లోని ఈ ప్రీమియర్ నిజంగా నాతో పాటు మొత్తం బృందానికి  సంతోషకరమైన మూమెంట్. ఎందుకంటే మన సంస్కృతిలో బాగా పాతుకుపోయిన కథను ప్రపంచ వేదికపై ప్రదర్శించబోతున్నారు. ప్రపంచ ప్రీమియర్‌లో ప్రేక్షకుల స్పందన చూసి మేము నిజంగా థ్రిల్‌గా ఫీల్ అవుతాం అన్నారు.
T-సిరీస్ నుండి భూషణ్ కుమార్  మాట్లాడుతూ.. “భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం మనందరికీ నిజంగా గర్వకారణం. ట్రిబెకా ఫెస్టివల్ అనేది ప్రపంచంలోని అత్యంత ప్రశంసలు పొందిన ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటి. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో ప్రేమతో పని చేశాం. ఆదిపురుష్ అందరికీ విజువల్ ట్రీట్‌గా ఉండబోతోంది. ఇది ప్రపంచ ప్రేక్షకులను  మంత్రముగ్దులను చేస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను.. ” అన్నారు.
నటుడు ప్రభాస్‌ మాట్లాడుతూ..
“న్యూయార్క్‌లోని ట్రిబెకా ఫెస్టివల్‌లో ఆదిపురుష్ వరల్డ్ ప్రీమియర్‌ను ప్రదర్శించడం నాకు గర్వకారణం. మన దేశం యొక్క నైతికతకు అద్దం పట్టే ప్రాజెక్ట్‌లో భాగం కావడం ఒక  అదృష్టం. మన భారతీయ చిత్రాలను చూడటం, ముఖ్యంగా ఆదిపురుష్, ప్రపంచ స్థాయికి చేరుకోవడం నాకు నటుడిగానే కాకుండా భారతీయుడిగా కూడా చాలా గర్వంగా ఉంది. ట్రిబెకాలో ప్రేక్షకుల స్పందన కోసం నేను ఎదురు చూస్తున్నాను.”అన్నారు.

ఆదిపురుష్‌ లో ప్రభాస్‌, కృతి సనన్‌, సైఫ్‌ అలీఖాన్‌, సన్నీ సింగ్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఓం రౌత్ దర్శకత్వం వహించారు. T-సిరీస్‌కి చెందిన భూషణ్ కుమార్ & క్రిషన్ కుమార్, ఓం రౌత్, ప్రసాద సుతారియా, రెట్రోఫిల్స్‌ రాజేష్ నాయర్ తో పాటు యు.వి క్రియేషన్స్ ప్రమోద్, వంశీ  నిర్మించారు. ఆదిపురుష్  జూన్ 16, 2023న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.

Tags

Related Articles

Back to top button
Close
Close