
బిగ్‌బాస్ ఫేం ఇనాయా సుల్తానా హీరోయిన్‌గా ‘నవరత్నాలు’
Bigg Boss fame Inaya Sultana as heroine in 'Nataratnalu'

ఇనయా సుల్తానా పరిచయం అవసరం లేని నటి. ఆర్‌జీవీతో ఆమె చేసిన డాన్స్ ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే! ఆ క్రేజ్‌తో బిగ్‌బాస్ తెలుగు సీజన్‌లో అవకాశం అందుకుంది. స్ట్రెయిట్‌గా తనదైన శైలిలో ఆడి బిగ్‌బాస్ ఆడియన్స్‌ను మెప్పించింది. ఆడపాదడపా పలు చిత్రాల్లోనూ మెరిశారు.తాజాగా ఆమె హీరోయిన్‌గా అవకాశం అందుకున్నారు. శివనాగు దర్శకత్వం వహిస్తున్న ‘నటరత్నాలు’ చిత్రంలో ఇనయా కథానాయికగా నటించనున్నారు. ఎవరెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సమర్పణలో చందన ప్రొడక్షన్స్ పతాకంపై డా. దివ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. నర్రా శివనాగు దర్శకుడు. త్వరలో ఈ చిత్రానికి సంబంధించిన వివరాలు వెల్లడిస్తామని నిర్మాతతెలిపారు.
నటీనటులు
సుదర్శన్, రంగస్థలం మహేష్, అర్జున్ తేజ్, తాగుబోతు రమేష్, అర్యన, టైగర్ శేషాద్రి, చంటి, సూర్యకిరణ్, రవికుమార్‌చౌదరి, సుమన్‌శెట్టి తదితరులు.
సాంకేతిక నిపుణులు:
కెమెరా: గిరి.కె.కుమార్,
ఎడిటర్: ఆవుల వెంకటేశ్
సంగీతం: శంకర్ మహదేవ్
సింగర్స్: గీతా మాధురి, వినాయక్, రవికిషోర్
కో–ప్రొడ్యూసర్స్: మణికంఠ–యల్లామటి చంఇ
దర్శకత్వం: నర్రా శివనాగు.