
ఆకట్టుకుంటున్న సిద్ధార్థ్ ‘టక్కర్’ టీజర్
People Media Factory, Abhishek Agarwal Arts to release Siddharth’s bilingual Takkar on May 26; action-packed teaser launched

*టక్కర్ కోసం సరికొత్త అవతార్ లో సిద్ధార్థ్
*తెలుగు, తమిళ భాషల్లో మే 26న విడుదల
‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’, ‘బొమ్మరిల్లు’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల హృదయాల్లో చెరగని స్థానాన్ని సంపాదించుకున్న చార్మింగ్ హీరో సిద్ధార్థ్ ‘టక్కర్’ అనే సినిమాతో సరికొత్తగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి కార్తీక్ జి. క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్ తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని తెలుగు లో విడుదల చేస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ కథానాయికగా నటిస్తున్నారు. 2023, మే 26న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో థియేటర్లలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఈరోజు(ఏప్రిల్ 17) సిద్ధార్థ్ పుట్టినరోజు సందర్భంగా ‘టక్కర్’ మూవీ టీజర్ ను విడుదల చేశారు మేకర్స్. రొమాన్స్, యాక్షన్ మేళవింపుతో రూపొందిన టక్కర్ టీజర్ ఎంతగానో ఆకట్టుకుంటోంది. “నేనంటే ఇష్టం లేదా”, “లవ్ అంటేనే ఇష్టంలేదు” అంటూ నాయకానాయికల సంభాషణలతో టీజర్ ఆసక్తికరంగా ప్రారంభమైంది. అసలు ప్రేమ అనేదే లేదని నమ్మే యువతికి ఓ యువకుడు దగ్గరవ్వడం, ఆ తరువాత జరిగిన పరిణామాల నేపథ్యంలో రూపొందిన టీజర్ ఆసక్తికరంగా సాగింది. ఇక టీజర్ లో సిద్ధార్థ్ సరికొత్త మేకోవర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ రొమాంటిక్ యాక్షన్ రైడ్ ప్రేక్షకులను అలరించడం ఖాయమని మేకర్స్ నమ్మకంగా ఉన్నారు.
అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్ తదితరులు ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. నివాస్ కె. ప్రసన్న సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్ గా వాంచినాథన్ మురుగేశన్, ఎడిటర్ గా జీఏ గౌతమ్, ఆర్ట్ డైరెక్టర్ గా ఉదయ కుమార్ కె వ్యవహరిస్తునాన్రు.
తారాగణం: సిద్ధార్థ్, దివ్యాంశ కౌశిక్, అభిమన్యు సింగ్, యోగి బాబు, మునీశ్ కాంత్, ఆర్జే విజ్ఞేశ్ కాంత్
రచన, దర్శకత్వం: కార్తీక్ జి. క్రిష్
సంగీతం: నివాస్ కె ప్రసన్న
సినిమాటోగ్రాఫర్: వాంచినాథన్ మురుగేశన్
ఎడిటర్: జీఏ గౌతమ్
ఆర్ట్ డైరెక్టర్: ఉదయ కుమార్ కె
స్టంట్స్ కోరియోగ్రఫీ: దినేష్ కాశి
పబ్లిసిటీ డిజైన్స్: 24AM
టీజర్ కట్: ప్రదీప్ ఈ రాఘవ్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహా నిర్మాత: వివేక్ కూచిభొట్ల
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మయాంక్
బ్యానర్స్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్
పీఆర్ఓ: లక్ష్మీ వేణుగోపాల్, వంశీ – శేఖర్
Pro: Vamsi – Shekar