MOVIE NEWS

విక్టరీ వెంకటేష్, శైలేష్ కొలను, వెంకట్ బోయనపల్లి, నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ సైంధవ్ నుంచి మనోజ్ఞ గా  శ్రద్ధా శ్రీనాథ్‌ పరిచయం

Introducing Shraddha Srinath As Manognya From Victory Venkatesh, Sailesh Kolanu, Venkat Boyanapalli, Niharika Entertainment’s Prestigious Project Saindhav

విక్టరీ వెంకటేష్ 75వ లాండ్ మార్క్ మూవీ ‘సైంధవ్’ ప్రస్తుతం వైజాగ్‌లో చిత్రీకరణ జరుపుకుంటుంది. టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శైలేష్ కొలను దర్శకత్వంలో నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వెంకట్ బోయనపల్లి ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రం హైదరాబాద్‌ లో తొలి షెడ్యూల్‌ను పూర్తి చేసుకుంది. చిన్న విరామం తర్వాత ప్రధాన తారాగణంతో రెండో షెడ్యూల్ వైజాగ్‌ లో జరుగుతోంది.

ఈ చిత్రంలో శ్రద్ధా శ్రీనాథ్ కథానాయికగా నటిస్తోంది. ఈరోజు ఆమె పాత్రను మనోజ్ఞ గా పరిచయం చేశారు. పోస్టర్ లో ఏదో లోతుగా ఆలోచిస్తున్నట్లు చాలా సీరియస్‌ గా కనిపిస్తోంది. చేతిలో లంచ్ బాక్స్‌ తో కారులో కూర్చుని వుంది కానీ ఆమె దృష్టి మరెక్కడో వుంది.

మనోజ్ఞ క్యారెక్టర్ ఇప్పటి వరకు శ్రద్ధకు వచ్చిన పాత్రల్లో బెస్ట్. ఇది పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ క్యారెక్టర్. జెర్సీలో తన నటనకు ప్రశంసలు పొందిన శ్రద్ధా సైంధవ్‌ లో మనోజ్ఞ గా ప్రేక్షకులను ఆశ్చర్యపరచనుంది. చాలా మంది అద్భుతమైన నటీనటులు   కలిసి తెరపై కనిపిస్తూ ప్రేక్షకులకి గొప్ప అనుభూతి ని ఇవ్వనున్నారు. బాలీవుడ్ వెర్సటైల్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్ధిఖీ ఈ చిత్రంతో టాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. అలాగే పలువురు ప్రముఖ నటీనటులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ చిత్రం కోసం పని చేస్తున్నారు. సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. ఎస్ మణికందన్ కెమెరామెన్ గా, గ్యారీ బిహెచ్ ఎడిటర్  గా, అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి కిషోర్ తాళ్లూరు సహ నిర్మాత.

ఇతర నటీనటులను త్వరలో మేకర్స్ త్వరలో అనౌన్స్ చేస్తారు. సైంధవ్  పాన్ ఇండియా చిత్రంగా అన్ని దక్షిణాది భాషలు, హిందీలో డిసెంబర్ 22న క్రిస్మస్ సందర్భంగా విడుదల కానుంది.

 తారాగణం: వెంకటేష్, నవాజుద్దీన్ సిద్ధిఖీ, శ్రద్ధా శ్రీనాథ్‌
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం : శైలేష్ కొలను
నిర్మాత: వెంకట్ బోయనపల్లి
బ్యానర్: నిహారిక ఎంటర్‌టైన్‌మెంట్
సంగీతం: సంతోష్ నారాయణ్
సహ నిర్మాత: కిషోర్ తాళ్లూరు
డీవోపీ: ఎస్.మణికందన్
ఎడిటర్: గ్యారీ బిహెచ్
ప్రొడక్షన్ డిజైనర్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: ప్రవీణ్ ఘంటా
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్ వెంకటరత్నం (వెంకట్)
పీఆర్వో : వంశీ-శేఖర్
పబ్లిసిటీ డిజైనర్: అనిల్ & భాను
మార్కెటింగ్: CZONE డిజిటల్ నెట్‌వర్క్
డిజిటల్ ప్రమోషన్స్: హాష్‌ట్యాగ్ మీడియా

Tags

Related Articles

Back to top button
Close
Close