MOVIE NEWSSpecial Bites

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ఏజెంట్ నుంచి ‘ది గాడ్’ గా డినో మోరియా పరిచయం

Introducing Dino Morea As ‘The God’ From Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని, స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి క్రేజీ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ ఏజెంట్ లో  పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సాక్షి వైద్య అఖిల్ కు జోడిగా కనిపిస్తుండగా,  మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ రోజు, ఏజెంట్ నుంచి డినో మోరియాను  ‘ది గాడ్’ గా పరిచయం చేశారు. రాజ్, అక్సర్, జూలీ మొదలైన చిత్రాలలో తన పాత్రలకు పేరుపొందిన బాలీవుడ్ స్టార్ డినో మోరియా..చేతిలో మెషిన్ గన్‌తో పోస్టర్‌లో పవర్ ఫుల్ గా కనిపిస్తున్నాడు. అతని పొడవాటి జుట్టు, నెరిసిన గడ్డం , ముఖం మీద గాయాలు ఈ పాత్రను మరింత డెడ్లీ గా ప్రజెంట్ చేస్తున్నాయి.  

మొదటి రెండు పాటల్లానే  నిన్న విడుదలైన మూడో పాట రామాకృష్ణ కూడా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. హిప్ హాప్ తమిళ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌,  అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

ఏప్రిల్ 28న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర,  దీపా రెడ్డి సహ నిర్మాతలు.

తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర,  దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిళ
డీవోపీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
పీఆర్వో : వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close