MOVIE NEWSSpecial Bites

అఖిల్ అక్కినేని, సురేందర్ రెడ్డి, ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ థర్డ్ సింగిల్ రామాకృష్ణా పాట విడుదల 

Celebrate Boys Anthem, The Third Single Rama Krishna From Akhil Akkineni, Surender Reddy, AK Entertainment’s Pan India Film Agent is out now

యంగ్ అండ్ డైనమిక్ హీరో అఖిల్ అక్కినేని మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘ఏజెంట్’ ఏప్రిల్ 28న బిగ్ స్క్రీన్స్ పైకి రానుంది. స్టైలిష్ మేకర్ సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఏజెంట్ ఇప్పటికే ప్రామెసింగ్ ప్రమోషనల్ కంటెంట్ తో దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొల్పింది.  ఏజెంట్ టీజర్ నేషనల్ వైడ్ ట్రెండ్ అవ్వగా, ఇప్పటికే విడుదలైన పాటలు కూడా మ్యూజిక్ చార్ట్‌లలో అగ్రస్థానంలో ఉన్నాయి.

తాజాగా మేకర్స్ ఏజెంట్ నుంచి బాయ్స్ సెలబ్రేట్ చేసుకునే బ్రేక్-అప్ సాంగ్ ‘రామాకృష్ణా’ పాటని విడుదల చేశారు. ఇది బ్రేక్-అప్ సాంగ్ అయినప్పటికీ, అఖిల్ ఈ అకేషన్ ని జరుపుకోవడంతో పండుగ వైబ్ తో అలరించింది. హీరో జీవితాన్ని బ్రేకప్ ప్రభావితం చేయలేదని చాలా ఆసక్తికరంగా వినోదాత్మకంగా చెప్పారు. అకాడమీ అవార్డు గ్రహీత చంద్రబోస్ ఈ పాటకు సాహిత్యం అందించారు. హిప్ హాప్ తమిళ పెప్పీ నంబర్‌ని స్కోర్ చేయగా, రామ్ మిర్యాల ఈ పాటని ఎనర్జీటిక్ గా పాడారు.  

అఖిల్ ఒక సాధువులా కాషాయ దుస్తులు ధరించి కనిపించడం సర్ ప్రైజింగ్ గా వుంది. ఈ పాటలో అఖిల్ గ్రేస్ ఫుల్ డ్యాన్స్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కలర్‌ఫుల్ సెట్‌లో చిత్రీకరించిన పాటలో సాక్షి వైద్య కూడా కాషాయం ధరించి కనిపించింది. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ అందించారు.  

సురేందర్ రెడ్డి మునుపెన్నడూ చూడని అవతార్, క్యారెక్టర్‌లో అఖిల్‌ని ప్రెజెంట్ చేస్తున్నారు. మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఈ చిత్రానికి కథను వక్కంతం వంశీ అందించారు. రసూల్ ఎల్లోర్ కెమెరా మెన్ గా పని చేస్తున్నారు. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా పతాకాలపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత నవీన్ నూలి ఎడిటర్‌,  అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్.

తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రానికి అజయ్ సుంకర,  దీపా రెడ్డి సహ నిర్మాతలు.

తారాగణం: అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య, మమ్ముట్టి
దర్శకత్వం: సురేందర్ రెడ్డి
నిర్మాత: రామబ్రహ్మం సుంకర
సహ నిర్మాతలు: అజయ్ సుంకర,  దీపా రెడ్డి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గరికిపాటి
బ్యానర్లు: ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్, సురేందర్ 2 సినిమా
కథ: వక్కంతం వంశీ
సంగీతం: హిప్ హాప్ తమిళా
డీవోపీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్: నవీన్ నూలి
ఆర్ట్ డైరెక్టర్: అవినాష్ కొల్లా
పీఆర్వో : వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close