MOVIE NEWS

గోపీచంద్, శ్రీవాస్, టీజీ విశ్వ ప్రసాద్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ‘రామబాణం’ సెకండ్ సింగిల్ ‘దరువెయ్యరా’ ఏప్రిల్ 14న గ్రాండ్ గా విడుదల

Gopichand, Srivas, TG Vishwa Prasad, People Media Factory 'Ramabanam' second single 'Daruveyyara' will be released on April 14.

మాచో హీరో గోపీచంద్, దర్శకుడు శ్రీవాస్ కలిసి రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించారు. ఇప్పుడు వారి మూడో చిత్రం ‘రామబాణం’తో హ్యాట్రిక్ పూర్తి చేయనున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత.

యాక్షన్ అంశాలతో కూడిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ‘రామబాణం’ గ్లింప్స్‌, ఫస్ట్ సింగిల్ ఐఫోన్ సాంగ్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ చిత్రం సెకండ్ సింగిల్ దరువెయ్యరా పాటని ఏప్రిల్ 14న కర్నూల్ అవుట్ డోర్ స్టేడియంలో జరిగే గ్రాండ్ ఈవెంట్ లో లాంచ్ చేయనున్నట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. గోపిచంద్, డింపుల్ హయాతీ పండగ వాతావణంలో సంప్రదాయ దుస్తులలో గ్రేస్ ఫుల్ గా డ్యాన్స్ చేస్తున్న అనౌన్స్ మెంట్ పోస్టర్ ఆకట్టుకుంది.

భూపతి రాజా ఈ చిత్రానికి కథను అందించగా, వెట్రి పళని స్వామి సినిమాటోగ్రఫీ, మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు. మధుసూదన్ పడమటి డైలాగ్స్ అందించగా, ప్రవీణ్ పూడి ఎడిటర్.

జగపతి బాబు, ఖుష్బు ముఖ్య తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రంలో సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.

సమ్మర్ కానుకగా మే 5న రామబాణం విడుదలకు సిద్ధమవుతోంది.

తారాగణం: గోపీచంద్, డింపుల్ హయతీ, జగపతి బాబు, ఖుష్బు, సచిన్ ఖేడేకర్, నాజర్, అలీ, రాజా రవీంద్ర, వెన్నెల కిషోర్, సప్తగిరి, కాశీ విశ్వనాథ్, సత్య, గెటప్ శ్రీను, సమీర్, తరుణ్ అరోరా

సాంకేతిక విభాగం:
దర్శకత్వం: శ్రీవాస్
నిర్మాత: టీజీ విశ్వ ప్రసాద్
సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల
బ్యానర్: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ
సంగీతం: మిక్కీ జె మేయర్
డీవోపీ: వెట్రి పళనిసామి
ఎడిటర్: ప్రవీణ్ పూడి
కథ: భూపతి రాజా
డైలాగ్స్: మధుసూదన్ పడమటి
ఆర్ట్ డైరెక్టర్: కిరణ్ కుమార్ మన్నె
పీఆర్వో: ఎల్ వేణుగోపాల్, వంశీ-శేఖర్
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close