
సునీల్, శ్రద్ధా దాస్, సంతోష్ కంభంపాటి, వనమాలి క్రియేషన్స్ ‘పారిజాత పర్వం’ టైటిల్ లుక్ పోస్టర్ విడుదల
Sunil, Shraddha Das, Santhosh Kambhampati, Vanamali Creations 'Parijata Parvam' title look poster release

సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహిధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న కొత్త చిత్రానికి టైటిల్ ఖరారైయింది.
ఈ చిత్రానికి ‘పారిజాత పర్వం’ అనే ఆసక్తికరమైన టైటిల్ ని పెట్టారు. టైటిల్ పోస్టర్ కూడా చాలా ఇంట్రస్టింగా వుంది. ఓ అమ్మాయికి ముసుగు వేసి చైర్ లో బంధించినట్లు విడుదల చేసిన టైటిల్ లుక్ పోస్టర్ క్యురియాసిటీని పెంచింది. త్వరలోనే మేకర్స్ ఫస్ట్ లుక్ ని విడుదల చేస్తారు.
ఈ చిత్రంలో వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ ఇతరకీలక పాత్రలు పోషిస్తున్నారు.


బాల సరస్వతి కెమరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహ నిర్మాత.
తారాగణం: సునీల్, శ్రద్ధా దాస్, చైతన్య రావు, మాళవిక సతీశన్, వైవా హర్ష, శ్రీకాంత్ అయ్యంగార్, సురేఖ వాణి, సమీర్ , గుండు సుదర్శన్ , జబర్దస్త్ అప్పారావు, టార్జాన్ , గడ్డం నవీన్ ,తోటపల్లి మధు, జబర్దస్త్ రోహిణి
సాంకేతిక విభాగం :
రచన, దర్శకత్వం – సంతోష్ కంభంపాటి
ప్రొడక్షన్: వనమాలి క్రియేషన్స్
నిర్మాతలు : మహిధర్ రెడ్డి, దేవేష్
సహ నిర్మాత -అనంత సాయి
డీవోపీ-బాల సరస్వతి
సంగీతం-రీ
ఎడిటర్- శశాంక్ వుప్పుటూరి
ఆర్ట్ డైరెక్టర్ – ఉపేందర్ రెడ్డి
డిజైనర్ – చిన్మయి కాకిలేటి
పబ్లిసిటీ డిజైనర్ – అనంత్ కంచెర్ల
సౌండ్ ఎఫెక్ట్స్- పురుషోత్తం రాజు
సాహిత్యం-రామజోగయ్య శాస్త్రి, కిట్టు విస్సాప్రగడ, సాయి కిరణ్, రాంబాబు గోసాల
పీఆర్వో -వంశీ శేఖర్
Pro: Vamsi – Shekar