MOVIE NEWS

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ ZEE స్టూడియోస్ సౌత్ మరియు వండర్ బార్ ఫిల్మ్స్ కొత్త చిత్రం ప్రకటన

National Award winning actor, Dhanush and acclaimed filmmaker, Mari Selvaraj, join hands once again following their blockbuster movie 'Karnan', for a new project produced by ZEE Studios South and Wunderbar Films.

Dhanush

నేషనల్ అవార్డు విన్నర్ ధనుష్, విలక్షణ దర్శకుడు మారి సెల్వరాజ్ ZEE స్టూడియోస్ సౌత్ మరియు వండర్ బార్ ఫిల్మ్స్ నిర్మించే కొత్త ప్రాజెక్ట్ కోసం వారి బ్లాక్ బస్టర్ మూవీ ‘కర్ణన్’ తర్వాత మరోసారి చేతులు కలిపారు. బ్లాక్ బస్టర్ కర్ణన్ రెండవ వార్షికోత్సవం పురస్కరించుకుని మేకర్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ ని ఈ రోజు అధికారికం గా ప్రకటించారు.

ఇంకా పేరు పెట్టని ఈ ప్రాజెక్ట్, నటుడు ధనుష్ కెరీర్ లో పెద్ద కాన్వాస్ పై రూపొందించిన అత్యధిక బడ్జెట్ సినిమాలలో ఒకటి కానుంది. ఈ చిత్రం తో ధనుష్ సొంత బ్యానర్ వండర్బార్ ఫిల్మ్స్ చలనచిత్ర నిర్మాణంలోకి తిరిగి రావడం ప్రధాన ఆకర్షణ గా నిలిచింది.

ZEE స్టూడియోస్ మరియు వండర్బార్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించనున్న ఈ చిత్రంలో విభిన్న పరిశ్రమలకు చెందిన ప్రముఖ నటీనటులు మరియు అగ్ర శ్రేణి సాంకేతిక నిపుణులు భాగం కానున్నారు, వీటికి సంబంధించిన వివరాలు మేకర్స్ త్వరలో ప్రకటిస్తారు.                                                        
Zee స్టూడియోస్ సౌత్ మూవీస్ హెడ్ అక్షయ్ కేజ్రీవాల్ అసోసియేషన్ గురించి  మాట్లాడుతూ, ” వండర్ బార్ ఫిల్మ్స్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ లో భాగం కావడం మాకు చాలా ఆనందంగా మరియు గర్వంగా ఉంది. ఈ చిత్రం ద్వారా బ్లాక్ బస్టర్ ‘కర్ణన్ ద్వయం ను మరొక్క సారి ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం చాలా సంతోషం గా ఉంది. తన బహుముఖ ప్రజ్ఞ తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులను ఆకట్టుకున్న ధనుష్ మరియు మాస్టర్ క్రాఫ్ట్ మ్యాన్  మారి సెల్వరాజ్ తో కలసి పనిచేయడం మా సంస్థ కి గౌరవం.జీ స్టూడియోస్ లో, ప్రజలను అలరించే మరియు ప్రేరేపించే కంటెంట్ ని రూపొందించడమే మా లక్ష్యం మరియు ఈ చిత్రం అదే రేంజ్ లో నిర్మించబోతున్నాం” అన్నారు
Pro: Vamsi – Shekar

Tags

Related Articles

Back to top button
Close
Close