MOVIE NEWS

రాఘవ లారెన్స్, కతిరేసన్, ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ఎల్పి, పిక్సెల్ స్టూడియోస్ ‘రుద్రుడు’ థియేట్రికల్ ట్రైలర్ విడుదల

Raghava Lawrence, Kathiresan, Five Star Creations LLP, Pixel Studios’ Rudhrudu Theatrical Trailer Launched

యాక్టర్ -కొరియోగ్రాఫర్-ఫిల్మ్ మేకర్ రాఘవ లారెన్స్ హీరోగా కతిరేసన్ దర్శకత్వంలో రాబోతున్న యాక్షన్ థ్రిల్లర్ రుద్రుడు ఈ నెల 14న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. లారెన్స్ సరసన ప్రియా భవానీ శంకర్ కథానాయికగా నటిస్తుండగా, శరత్ కుమార్ కీలక పాత్రలో కనిపించనున్నారు.

ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్‌ఎల్‌పి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, కతిరేశన్ సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. పిక్సెల్ స్టూడియోస్‌ ప్రొడ్యూసర్ ఠాగూర్ మధు ఈ సినిమా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ థియేట్రికల్ హక్కులను పొందారు. ఈ సినిమా ఆడియో ఆల్బమ్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఈరోజు థియేట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేసారు.

రాఘవ లారెన్స్ కుటుంబంతో సంతోషకరమైన జీవితాన్ని గడుపుతుంటాడు. తనకి ఇష్టమైన అమ్మాయి ప్రియా భవానీ శంకర్ ని పెళ్లి చేసుకుంటాడు. అయితే, శరత్ కుమార్ తన జీవితంలోకి ఎంట్రీ ఇవ్వడంతో కష్టాలు మొదలౌతాయి. అయినప్పటికీ, దృఢంగా నిలబడి, క్రిమినల్ ని  పట్టుకోవాలని నిర్ణయించుకుంటాడు.

సినిమాలో ఎంటర్‌టైన్‌మెంట్, రొమాన్స్, యాక్షన్, డ్రామా ఉండేలా చూసుకున్నాడు కతిరేసన్. అన్ని వర్గాలకు సంబంధించిన అంశాలతో కూడిన పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ ఇది.

రాఘవ లారెన్స్ సాలిడ్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నారు. అతని డ్యాన్స్ ఎప్పటిలాగే సూపర్బ్ గా వుంది. స్టంట్ సన్నివేశాలు అద్భుతంగా కొరియోగ్రఫీ చేశారు. ప్రియా భవానీ శంకర్ కథానాయికగా ఆకట్టుకుంది. శరత్ కుమార్ విలన్ గా భయపెట్టారు

జివి ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, ఆర్ డి రాజశేఖర్ ఐఎస్ సి సినిమాటోగ్రఫీ బిగ్ ఎసెట్. ఎడిటింగ్ ఆంథోనీ, స్టంట్స్ శివ-విక్కీ. ట్రైలర్ మంచి ఇంప్రెషన్ ఇచ్చి సినిమా చూడాలనే క్యూరియాసిటీ ని మరింతగా పెంచింది.

తారాగణం: రాఘవ లారెన్స్, శరత్ కుమార్, ప్రియా భవానీ శంకర్, పూర్ణిమ భాగ్యరాజ్, నాజర్

సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం – కతిరేశన్
నిర్మాత- కతిరేశన్
బ్యానర్: ఫైవ్ స్టార్ క్రియేషన్స్ LLP
విడుదల: పిక్సెల్ స్టూడియోస్ (ఠాగూర్ మధు)
సంగీతం: జి.వి. ప్రకాష్ కుమార్
డి వో పీ: RD రాజశేఖర్ ISC
ఎడిటర్: ఆంథోని
స్టంట్స్ : శివ – విక్కీ

Tags

Related Articles

Back to top button
Close
Close